Andhra Pradesh: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ బదిలీ. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అధికారులపై కొత్త రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్, విజిలెన్స్ ఐజీ, ఎక్స్ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. By Manogna alamuru 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP CID Transferred: ఆంధ్రాలో పలువురు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్, విజిలెన్స్ ఐజీ, ఎక్స్ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిద్దరూ వెంటనే డీజీపీ కార్యాలయంలె రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాత ప్రభుత్వం ఉన్న సమయంలో వీరు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇప్పుడు వారిని బదిలీ చేయాలని భావిస్తోంది. ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిలను సైతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిద్దరూ కూడా వెంటనే పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు అప్పగిస్తూ ఆదేశించారు. Also Read: రామోజీరావు ఇక లేరు #andhra-pradesh #cid #transfer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి