/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T154231.018.jpg)
Anchor Shyamala : ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ (YCP) తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ జగన్ ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించింది. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీనే గెలుస్తుందని, జగనే (YS Jagan) సీఎం అవుతారని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓడిపోతానని కామెంట్స్ చేసింది. కట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయింది.
ఏపీలో కూటమి గెలవడం, పవన్ పిఠాపురం MLA గా భారీ విజయం సాధించడం జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో శ్యామల తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఎన్నికల్లో గెలిచిన కూటమికి, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : ఓవర్సీస్ లో ప్రభాస్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘కల్కి’ టికెట్స్!
చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి...
" నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆ కాల్స్ వాళ్ళ భయంగా కూడా ఉంది. నేను ఎవరినీ కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు.వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. ఎవరి అభిమానం వారిది. నాకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానను. భవిష్యత్తులోనూ పార్టీ కోసం నా వంతుగా కష్టపడతా. ఉన్నది మాత్రమే చెప్పను. లేనిది చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా" అని వీడియోలో పేర్కొంది.
Tamannaah: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..
తమన్నా బ్రేకప్ స్టోరీ అందరికి తెలిసిందే, అయితే ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి ఆలోచన లేదని మిల్కీబ్యూటీ వెల్లడించింది. కెరీర్‌పైనే దృష్టి పెట్టిన ఆమె, పెళ్లి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చింది. దీంతో ఆమె ఒంటరిగా ఉండాలనుకుంటుందా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
Tamannaah About Marriage
Tamannaah: చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ప్రేమ, పెళ్లి విషయంలో చాలాసార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్‌కు బ్రేక్ పడుతుందేమోనన్న ఆందోళన, ఇంకా బ్రేకప్ ల వల్ల పెళ్లంటే వెనకడుగు వేయడం సాధారణంగా చూస్తుంటాం.
ఇటీవల తమన్నా భాటియా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ, దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ద్వారా తనదైన గుర్తింపును సంపాదించుకుంది.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..
గత కొద్ది కాలంగా ఆమె విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉందన్న వార్తలు జోరుగా వినిపించాయి. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో, వారి మధ్య సంబంధం నిజమేనని అందరూ నమ్మారు. అయితే ఇటీవల వీరి మధ్య విభేదాలు వచ్చాయని, బ్రేకప్ జరిగిందని బోలెడన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు బలమైన ఆధారాలు వెలుగులోకి రావడంతో, అభిమానులు కూడా వారి మధ్య తేడాలు నిజమేనని నమ్మారు.
Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్
అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే 35 వసంతాలు పూర్తి చేసుకున్న తమన్నాను ఇటీవల ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రశ్నించగా, “ఇప్పటికి తనకు అలాంటి ఆలోచన లేదని” స్పష్టం చేసింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే అని చెప్పిన ఆమె, పెళ్లిపై పెద్దగా ఆలోచించట్లేదని క్లియర్‌గా చెప్పింది.
Also Read: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్
దాంతో అభిమానుల మదిలో తమన్నా ఇప్పటికీ ఒంటరిగా ఉండాలనుకుంటున్నదా? లేక బ్రేకప్ కారణంగా పెళ్లిపై నమ్మకం కోల్పోయిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆమె ఈ నిర్ణయం మారుతుందా లేదా అనేది మాత్రం కాలమే చెప్పాలి.
Also Read: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా
Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్..
MURDER: ప్రియురాలే చంపింది.. వీడిన రియల్ ఎస్టేట్ రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ!
BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు..!
అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్లైన్లో బంగారు నాణేలు.. ఇలా బుక్ చేసుకోండి!
NTR- Kalyan Ram: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..