Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

నటి అనసూయ విజయ్ దేవరకొండతో వివాదంపై మరోసారి స్పందించారు.'సింబా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.."నేను ఈ విష‌యంపై స్పందించాలి అనుకోట్లేదు. మా మ‌ధ్య అంతా పెద్ద గోడ‌వ జ‌ర‌గ‌లేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. అంతే త‌ప్ప నాకు ఎవ‌రు మీద కోపం లేదని చెప్పింది.

New Update
Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

Actress Anasuya Bharadwaj : ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన 'సింబా' సినిమా (Simbaa Movie) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'సింబా' ట్రైలర్ లో ఒక సన్నివేశంలో, అనసూయ ఒక పాత్ర మహేష్ బాబు లేదా విజయ్ దేవరకొండ లాంటి భర్తను కోరుకుంటున్నట్లు చెబుతుంది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.

అనసూయ స్పందన ఇదే...

ఈ వివాదం నేపథ్యంలో, అనసూయ తాజాగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. "నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగానే ఆ డైలాగ్ చెప్పాను. నిజానికి నేను ఈ విష‌యంపై స్పందించాలి అనుకోట్లేదు. సినిమాలో ఎలాగైతే సందేశం ఇస్తామో అలాగే నేను ఇవ్వాలి అనుకున్నాను.

Also Read : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..!

మా మ‌ధ్య అంతా పెద్ద గోడ‌వ జ‌ర‌గ‌లేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అది లిమిట్స్ దాటిన‌ప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆరోజు ఎవ‌రు స్పందిచ‌క‌పోవ‌డంతో నేను మాట్లాడాల్సి వ‌చ్చింది. అంతే త‌ప్ప నాకు ఎవ‌రు మీద కోపం లేదు" అని తెలిపింది.

ఇక సింబా సినిమా విషయానికొస్తే.. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ మూవీ తెరకెకెక్కింది. ఈ సినిమాకు ముర‌ళి మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగ‌ష్టు 09న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

జాక్ ట్విట్టర్ రివ్యూ.. జోకర్‌గా మిగిలిన జాక్

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది.

New Update
Siddhu Jonnalagadda Jack Movie

Jack

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పై యాక్షన్ పెద్దగా పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అసలు కనిపించలేదు. నిజానికి ఈ మూవీలో అసలు కామెడీ పండలేదని టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ మూవీల్లో మార్క్ చూపించిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొట్టలేకపోయినట్లు తెలుస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ పర్లేదు.. కానీ సెకండాఫ్ మాత్రం కాస్త స్లోగా ఉంటుందట. 

 

Advertisment
Advertisment
Advertisment