Ananya: అతనికి ఆ ఆరాటమే లేదు.. ప్రియుడిపై అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రూమర్ బాయ్ ఫ్రెండ్ ఆదిత్యరాయ్‌ కపూర్‌పై నటి అనన్యాపాండే ప్రశంసలు కురిపించింది. 'ఆదిత్య చాలా ఓపికగా ఉంటాడు. వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని తొందరపడి ఒప్పుకోడు. ఒక్కసారి ఒప్పుకున్నాక ఆ పాత్రతో ప్రేమలో పడిపోతాడు. వందశాతం మనసు పెట్టి పని చేస్తాడు' అని చెప్పింది.

New Update
Ananya: అతనికి ఆ ఆరాటమే లేదు.. ప్రియుడిపై అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ananya pande: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యాపాండే  (Ananyapande) తన రూమర్ బాయ్ ఫ్రెండ్ ఆదిత్యరాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapur) పై ప్రశంసలు కురిపించింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ జోడీ పలుసార్లు జంటగా తిరుగుతూ కెమెరాల కంట చిక్కడంతో డేటింగ్ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ప్రేమ వ్యవహారంపై అన్యన్య, ఆదిత్యరాయ్‌ లు ఎప్పుడూ స్పందించకపోవడం విశేషం. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య.. ఆదిత్యను తెగ పోగిడేసింది.

ఏమీ దాచుకోడు..
ఈ మేరకు ఆదిత్యారాయ్ తనలో ఏ విషయం దాచుకోవడానికి ప్రయత్నించడని, తనతో అన్ని షేర్ చేసుకుంటాడని చెప్పింది. 'అతనిలో నాకు నచ్చే గుణాలలు చాలా ఉన్నాయి. ఆదిత్య చాలా ఓపికగా ఉంటాడు. ‘ఆషికీ 2’ తర్వాత తనకి చాలా అవకాశాలొచ్చాయి. కానీ వేటినీ తొందరపడి ఒప్పుకోలేదు. అతడికి నచ్చే ప్రాజెక్టు వచ్చే దాకా ఎదురు చూశాడు. ఒక్కసారి ఒప్పుకున్నాక ఆ పాత్రతో ప్రేమలో పడిపోతాడు. వందశాతం మనసు పెట్టి పని చేస్తాడు. ఎంత ఆలస్యమైనా సరే.. పరిశ్రమ నుంచి వచ్చే ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగడు’ అంటూ ప్రశంసలు కురిపించింది.

ఇది కూడా చదవండి : Kangana: అవును నేను ప్రేమలో ఉన్నాను.. కానీ అతనికి పెళ్లైంది: కంగన

ఆ ఆరాటం లేదు..
అలాగే తనలాగే అతను కూడా ఆదరాబాదరాగా ఒప్పుకొని, ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనపడాలనే ఆతృత అతడికేమాత్రం ఉండదని తెలిపింది. తనపై తాను నమ్మకం ఉంచుకొని నచ్చే కథ దొరికేవరకు ఎంతో ఓపిగ్గా ఉంటాడుని వెల్లడించింది. ఇక అనన్య చివరిసారిగా సిద్ధాంత్‌ చతుర్వేది తెరకెక్కించిన ‘ఖోగయే హమ్‌ కహా’లో కనిపించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment