/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8-4.jpg)
Anant Ambani-Radhika Merchant Wedding: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికల మ్యారేజ్‌ల మ్యారేజ్ ఈ రోజు రాత్రి 9.30కు ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో జరగనుండగా కాసేపట్లో ఊరేగింపుగా జియోవరల్డ్ సెంటర్‌కు వధూవరులు వెళ్లనున్నారు. ఇక ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకోసం ప్రపంచ నలుమూలలనుంచి బడా వ్యాపార, రాజకీయ వేత్తలు, సినీ తారలతోపాటు ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు.
View this post on Instagram
ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్టు దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తారల కోలాహలం నెలకొంది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నటుడు మహేష్ బాబు న్యూలుక్‌లో దర్శనమివ్వగా.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరవుతున్నారు.
View this post on Instagram
అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ముంబైకి చేరుకోగా.. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఇక క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్‌హామ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరై పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు.
View this post on Instagram