Ananth-Radhika Pre-Wedding: పెళ్లికాదు..ప్రీ వెడ్డింగే..2500 వంటకాలు..65 మంది చెఫ్‌లు..అంబానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.!

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అతిథులకు 2,500రకాల వంటకాలు వడ్డించనున్నారు. 75 రకాల బ్రేక్‌ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్‌తో మిడ్‌నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.

New Update
Ambani's Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు..

Ananth-Radhika Pre-Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీల వివాహానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుండి 3 వరకు జరగనుంది. అంబానీ కుటుంబం ఈ ప్రీ వెడ్డింగ్ ను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లన్నీ చేసింది. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు దేశం నుంచేకాకుండా విదేశాల నుంచి చాలా మంది అతిథులు రానున్నారు. ఆతిథ్యానికి ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇండోరి వంటకాలను తయారు చేయనున్నారు.

65 మంది చెఫ్‌లు:

ఈ ప్రీ వెడ్డింగ్ కు వచ్చే అతిథుల ప్రాధాన్యతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికావాల్సిన ఫుడ్ ను ముందుగానే సెలక్ట్ చేశారు. అందుకోసం ప్రీ వెడ్డింగ్‌కి వచ్చే అతిధులకు కావాల్సిన ఫుడ్ ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం ఇండోర్ నుండి దాదాపు 65 మంది చెఫ్‌లు వచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఇండోరి ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాు. దీంతో పాటు మెక్సికన్, పార్సీ, థాయ్, జపనీస్ తదితర వంటకాలను కూడా అతిథులకు అందించనున్నారు. దాదాపు 2500 వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటితో పాటు, మూడు రోజుల్లో ఏ వంటకం రిపీట్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.

మధ్యాహ్న భోజనంలో 225 వంటకాలు :
2500 వంటకాల్లో 75 రకాల ఐటమ్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చనున్నారు. మధ్యాహ్న భోజనానికి 225 వంటకాలు, రాత్రి భోజనానికి కనీసం 85 వంటకాలు ఉంటాయి. మిగిలిన ఆహార పదార్థాలను స్నాక్స్‌లో వేస్తారు. ఇండోర్ వంటకాలకు ప్రత్యేక ఇండోరి మసాలాలు జోడించనున్నారు. ఫిబ్రవరి 28నే అక్కడికి చేరుకున్న చెఫ్ ట్రయల్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత మార్చి 1 నుంచి అతిథులకు ఆహార పదార్థాలు అందజేయనున్నారు.

ప్రీ వెడ్డింగ్ లో మొదటి రోజు:
ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటి రోజును యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ ల్యాండ్ అని పిలుస్తారట. దీనికి డ్రెస్ కోడ్ కూడా ఉంటుందట. ఎలిగెంట్ కాక్ టెయిల్.

రెండో రోజు :
ప్రీ వెడ్డింగ్ లో రెండో రోజు ఎ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ ఈవెంట్ ఉంటుందట. దీనికి జంగిల్ ఫీవర్ డ్రెస్ కోడ్ ను నిర్ణయించారట.

మూడవ రోజు :
చివరి రోజు రెండు ఈవెంట్లు ఉండనున్నాయి. మొదటిది టస్కర్ ట్రైల్స్, దీనికి క్యాజువల్ చిక్ డ్రెస్ కోడ్ ఉంటుంది. చివరి ఈవెంట్ పేరు హస్తక్షర్ దీనికి హెరిటేజ్ ఇండియన్ వేర్ తో హాజరవుతారట.

ప్రీ వెడ్డింగ్ కు హాజరయ్యే ప్రముఖులు:
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్, అడ్నోక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ తో పాటు చాలా మంది వీఐపీలు రానున్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు హాజరుకానున్నారు. అర్జిత్ సింగ్, అజయ్-అతుల్, దిల్జిత్ దోశాంజ్ వంటి ప్రముఖ ఇండియన్ మ్యుజిషియన్స్ ఇక్కడ ప్రదర్శన ఇస్తారు. పాప్ స్టార్ రిహన్నా, మెజీషియన్ డేవిడ్ బ్లెయిన్‌, ఇతర ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ప్రదర్శన ఇస్తారు.

ఇది కూడా చదవండి: అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు ఏం చదువుకుందో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు