Anand Mahindra: మానవజాతి మారిపోయిందంటూ.. మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పోస్ట్ చేసిన మరో వీడియో వైరలవుతుంది. ఓ చిన్నారికి వాళ్ల అమ్మ ప్లేట్లో బజ్జి లాంటి ఓ పదార్థం పెడితే ఆ చిన్నారి దాన్ని ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకుంటుంది. మానవ జాతీ బాగా మారిపోయిందంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. By B Aravind 21 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఈరోజుల్లో ప్రతిఒక్కరి చేతిల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. ఒక్కరోజు కూడా మొబైల్ ఫోన్ వాడకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి వచ్చేసింది. పెద్దవాళ్లే కాకుండా నేటితరం చిన్నపిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. మొబైల్ చూపిస్తే గాని అన్నం తినరు.. ఏడ్చినప్పుడు మొబైల్ చూపిస్తేగాని మానరు. ఆటల కంటే ఫోన్‌లలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే తరుచుగా ఎక్స్ (ట్విట్టర్)లో కొత్త కొత్త విషయాలు పంచుకొని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇలాంటి చిన్న పిల్లల్ని ప్రతిబింబించేలా ఓ వీడియోను షేర్ చేశారు. Also Read: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!! ఫోన్ తర్వాతే అన్ని ఆ వీడియోను చూస్తే.. ఓ తల్లి తన బిడ్డ కోసం తిననడానికి ఒక ప్లేట్లో బజ్జి పెడుతుంది. కానీ ఆ చిన్నారి దాన్ని ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకుంటుంది. ఈ విడియోపై స్పందించిన మహీంద్రా.. 'ఇది నిజం మానవ జాతి బాగా మారిపోయింది. చిన్నారికి ఇప్పుడు ఫోన్ కావాలి. ఆ తర్వాతే రోటీ, దుస్తులు, ఇల్లు' అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Oh no, no, no…. It’s true. Our species has irreversibly mutated.. It’s now PHONE, and only AFTER that Roti, Kapda aur Makaan…! pic.twitter.com/49PmgGOYDV — anand mahindra (@anandmahindra) January 20, 2024 5 ఏళ్లకు ముందే చిన్నప్పటి నుంచే పిల్లలకు సెల్‌ఫోన్ అలవాటవుతోంది ఇది వారికి హానికరమంటూ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే 2020లో ' ప్యూ రీసెర్చ్' ప్రకారం.. 60 శాతం మంది చిన్నారులు తమకు 5 ఏళ్ల వయసు రాకముందే స్మార్ట్‌ఫోన్ల బారిన పడుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ వీటిని వాడటంతో.. వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. Also Read: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు #telugu-news #national-news #anand-mahindra-tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి