Watch Video: ఈ వీడియో గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది: ఆనంద్‌ మహీంద్రా

ఈనెల 19న అహ్మదాబాద్‌ స్టేడియంలో భారత్‌,ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేశారు. ఫైనల్ కోసం ఐఏఎఫ్ తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం గూస్‌బంప్స్‌ తెప్పిస్తోందని రాసుకొచ్చారు.

New Update
Anand Mahindra: లండన్‌ లో డబ్బావాలా.. ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌ వైరల్‌!

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్‌ కప్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఓ వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్‌ ఫైనల్ కోసం 'ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌' (IAF) తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు తనకు గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్నాయని ట్వీట్ చేశారు. మోటెరాలోని టెక్‌ మహీంద్ర ఇన్నోవేషన్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్.. ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే?

ఇదిలాఉండగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆ వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌ టైటిల్‌ పోరులో భారత్‌, ఆస్ట్రేలియా తలపడటం ఇది రెండోసారి. చివరగా 2011లో వరల్డ్‌ కప్‌ సాధించిన టీమిండియా.. ఈసారి గెలుపు కోసం గట్టి పట్టుదలతో ఉంది. ఇక చివరికి వరల్డ్‌ కప్‌ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచిచూడాల్సిందే.

Also read: షమీ, కోహ్లీ, రోహిత్‌, మ్యాక్స్‌వెల్‌.. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌ రికార్డులు చూస్తే షాక్‌ అవుతారు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు