Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా నియామకం

రేవంత్ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్ట్‌ ఆఫ్ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా నియామకం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యూనివర్సిటీ బోర్ట్‌ ఆఫ్ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్‌ మహీంద్రా ఏడాది కాలం పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది.

Also read: ఔటర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!

ఇదిలాఉండగా.. రాష్ట్ర యువతకు మెరుగైన స్కిల్స్ అందించేలా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. యువతకు మొత్తం 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం లక్ష మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని విస్తరిస్తున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌళిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగుతాయి.

Also Read: హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు