Andhra Pradesh: జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేశారు..! దొంగలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే.. ఈ కేటుగా మాత్రం పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం చేశారు. ఎలమంచిలి పీఎస్ నుంచి 2 బస్తాల గంజాయిని ఎత్తుకేళ్లారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తప్పవన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ. By Shiva.K 30 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Anakapalli News: ఇళ్లలో చోరీలు జరడం చూశాం.. రోడ్లపై చైన్ స్నాచింగ్ చూశాం.. బండ్లలో అక్రమ రవాణా సాగించడమూ చూశాం.. మరి, ఈ చోరులకు, అక్రమ రవాణాదారులకు చెక్ పెట్టేది మాత్రం ఖాకీలే. కానీ, ఇక్కడ ఏకంగా రక్షక భట నిలయంలోనే చోరీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు బస్తాలు ఎత్తుకెళ్లారు. ఖాళీ బస్తాలు కాదండోయ్.. నిండుగా ఉన్న గంజాయి బస్తాలు. అవును, పోలీస్ స్టేషన్ నుంచి కొందరు జగత్జంత్రీలు రెండు గంజాయి బస్తాలను దొంగిలించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రక్షణ కల్పించే రక్షకభట నిలయంలోనే ఈ చోరీ జరగడంతో.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే, ఈ బస్తాలు ఎత్తుకెళ్లిన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో పలువురు పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి తెలుసుకుందాం.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన గంజాయి బస్తాలను దొంగిలించిన కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఈ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. నిందితులు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల కళ్లుగప్పి రెండు గంజాయి బస్తాలను ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. నేరస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనలో స్టేషన్ పోలీసుల నిర్లక్ష్యం ఉందని, విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మురళి కృష్ణ తెలిపారు. Also Read: వారందరికీ 6 గ్యారెంటీలు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్.. తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా.. #robbery #police-station #ganja #anakapalli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి