Amitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్!

అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్‌ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు.

New Update
Amitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్!

Amitabh Bachchan About Kalki : టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) - పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898AD' (Kalki 2898 AD) కోసం సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేయడంతో ప్రెజెంట్ టాలీవుడ్ (Tollywood) లో అంతా ఈ మూవీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కల్కి పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రశంసలు ఎప్పటికీ ఆగవు

" ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరు. రోజులు గడిచేకొద్దీ షూటింగ్‌ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు దీని విజయం గురించి సంకేతాలిస్తాయి. డైరెక్టర్‌ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారు. ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.

ఇప్పుడు నేను మెచ్చుకున్నట్లే ఎంతోమంది దీన్ని ప్రశంసిస్తారు. ఇందులోని బుజ్జి (Bujji) మరో అద్భుతం. దర్శకుడి ఆలోచనలకు అది ప్రతిరూపం " అంటూ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీంతో కల్కి పై అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా జూన్ 27 న విడుదల కానుంది.

Also Read : ప్రభాస్ ‘బుజ్జి’ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!

Advertisment
Advertisment
తాజా కథనాలు