Amit Shah : రిజర్వేషన్లు రద్దు... అమిత్ షా హాట్ కామెంట్స్ మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అమిత్ షా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్లను రద్దు చేయబోమని తేల్చి చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Reservations Cancelled : లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల వేళ దేశ రాజకీయాల్లో(Politics) రిజర్వేషన్ల రద్దు అంశం సంచలనంగా మారింది. బీజేపీ(BJP) మరోసారి కేంద్రంలో అదికారంలోకి వస్తే దళితులు, వెనుకబడిన కులాలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేస్తోందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah). ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ప్రజలను బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తోందని చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అబద్దాలే అని కొట్టిపారేశారు. ALSO READ: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం... గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని.. రెండు సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజారిటీ ఇచ్చి కేంద్రంలో అధికారంలో పెట్టారని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశ్యం బీజేపీకి ఉంటే ఈపాటికి జరిగి ఉండేదని అన్నారు. దేశంలోని దళిత, వెనుకబడిన, ఆదివాసీ సోదర సోదరీమణులకు బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ/ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ఎప్పుడూ దాడి చేస్తోందని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిందని.. కానీ దీని వల్ల OBC కి చెందిన రిజర్వేషన్లు కట్ చేయబడ్డాయి అని అన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. అప్పుడు కూడా వెనుకపడ్డ కులాలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం, వెనుకపడిన కులాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పని చేయలేదని అన్నారు. #WATCH | Ahmedabad, Gujarat: On Congress leader Rahul Gandhi's tweet that "BJP wants to snatch away the reservation of Dalits, backward classes and tribals", Union HM Amit Shah says, "Rahul Gandhi is trying to mislead people by telling baseless lies. The BJP government has been… pic.twitter.com/EiAMT1Pwp7 — ANI (@ANI) April 28, 2024 #rahul-gandhi #reservations #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి