USA: చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..కాల్పుల తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు అమెరికా అధ్యక్ష పోటీల్లో రెండోసారి పాల్గొంటున్న ట్రంప్‌కు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం ఆయన మీద జరిగిన కాల్పుల్లో చెవికి గాయం అయింది. దీంతో చెవికి బ్యాండేజి వేశారు. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతూ ట్రంప్‌కు మద్దుతిస్తున్నారు ఫ్యాన్స్. By Manogna alamuru 18 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Trump Supporters: అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో తప్పించుకోగలిగారు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన షూటర్‌ను కాల్చి చంపారు. అలాగే ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ మద్ధతుదారుడు ఒకరు మృతిచెందారు. ఈ ఘటన తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు పెరుగుతోంది. ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల్లోపే చైనా మార్కెట్లలో ట్రంప్ టీషర్టులు వచ్చేశాయి. దాడి జరిగిన అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో టీ షర్టులపై ముద్రించారు. ఐ విల్ నెవర్ స్టాప్, ఫైట్ ఫర్ అమెరికా, షూటింగ్ మేక్స్ మీ స్ట్రాంగర్ అంటూ ట్రంప్ అన్న ఈ వ్యాఖ్యలను టీషర్టులపై ముద్రించారు. మరోవైపు ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఆయనకు మరింత మద్దతు పెరిగినట్లు పోలస్ స్టర్ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఘటన తర్వాత ప్రజల నుంచి ట్రంప్‌నకు 8 శాతం మద్ధతు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. కాల్పులు జరిగిన తర్వాత కూడా ట్రంప్ ప్రచారం ఆపలేదు. చెవికి బ్యాండేజి వేసుకుని కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్‌కు ఇదే ఐకాన్ అయిపోయింది. టరం్ మద్దుతుదారులు కూడా చెవికి బ్యాండేజి వేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ప్రచారం చేస్తున్న చోటుకు ట్రంప్‌లాగే కుడిచెవికి బ్యాండేజి వేసుకుని వచ్చి మద్దతు ఇస్తున్నారు. వీళ్ళే కాదు రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్న రిపబ్లికన్లు.. వినూత్న రీతిలో ఆయనకు మద్దతు తెలిపారు. తమ కుడి చెవికి తెల్లటి బ్యాండేజీలను కట్టుకుని సంఘీభావం తెలియజేశారు. #usa #supporters #trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి