Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా!

ఓ మహిళ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్ల అంటే రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది.ఈ ఘటన మూడు సంవత్సరాల క్రితం జరిగింది.

New Update
Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా!

American Airlines : మూడు సంవత్సరాల క్రితం విమానం (Flight) లో తప్పుగా ప్రవర్తించినందుకు ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ (Federal Aviation Administration) ఓ మహిళకు భారీ జరిమానా విధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021వ సంవత్సరంలో ఓ మహిళ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్ల అంటే రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు ఆమె జరిమానాను చెల్లించలేదు.

దీంతో ఆమె పై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కేసు పెట్టింది. 2021వ సంవత్సరంలో 34 ఏళ్ల హీథర్ వెల్స్ అనే మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో రచ్చ రచ్చ చేసింది. శాన్ ఆంటోనియో నివాసి అయిన హీథర్ వెల్స్ జులై 7, 2021న టెక్సాస్ (Texas) నుండి షార్లెట్‌కి వెళ్లే విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తుంది. ఆమె ఫ్లైట్ లో విస్కీని ఆర్డర్ చేసింది. అది తాగిన తర్వాత ఆమె తోటి ప్రయాణికులతో విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించింది.

ఆమె విమానంలో ప్రయాణిస్తున్న సమయంతో ఇతర ప్రయాణికులు, సిబ్బందితో గొడవ కూడా పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వారిపై ఉమ్మి వేసింది. అంతేకాదు విమానం మధ్యలో ఉన్న ప్రధాన గేటును కూడా తెరవడానికి ప్రయత్నించింది. చివరికి, సిబ్బందితో సహా ప్రయాణికులు హీథర్‌ను పట్టుకుని టేప్ సహాయంతో సీటుకు కట్టేశారు. ఆమె చర్యలకు ప్రస్తుతం రూ.68 లక్షలకు పైగా జరిమానా విధించారు. ఇది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విధించిన అత్యధిక జరిమానా.

విస్కీ తాగిన తర్వాత హీథర్ ఫ్లైట్ నుండి బయటకు వెళ్లాలని పట్టుబట్టి పరుగెత్తడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమె ఫ్లైట్‌లో కూర్చున్న ఇతర ప్రయాణికులతో కూడా అసభ్యంగా మాట్లాడింది. ఫ్లైట్‌లోనే క్రాల్ చేయడం ప్రారంభించింది. ఆమె చర్యలను ఆపడానికి ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె వారిని కొట్టింది. దీని కారణంగా విమాన సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. సీటుపై టేప్‌తో కట్టేసిన తర్వాత కూడా ఆమె శాంతించలేదు. దాడిని కొనసాగించి. ఆమె ముందు ఉన్న సీటును విరగగొట్టింది. ఆ తర్వాత ఆమెను మొదట అపస్మారక స్థితికి తీసుకుని వచ్చి. తర్వాత విమానం నుంచి కిందకి దించేశారు.

Also read: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

Advertisment
Advertisment
తాజా కథనాలు