/rtv/media/media_files/2025/04/23/itjjcx0lhbhRceYiUNmm.jpg)
Indus River
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది.
పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి .
సింధూ జలాల ఒప్పందం...
సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్.
ఎడారిగా మారనున్న పాక్..
ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.
ఏమిటీ ఒప్పందం..?
సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది.
today-latest-news-in-telugu | pakistan | sindhu | river
Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!!
కెనడా భారత్‌తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఉగ్రవాదిని భారత్ హతమార్చిందని ఆయన మంగళవారం పలు ఆరోపణలు చేశారు. ట్రూడో వ్యాఖ్యలతో భారత్, కెనడాల మధ్య దౌత్య స్థాయిలో పోరు మొదలైంది. విదేశాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోకూడదనేది భారత విధానం. స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఖలిస్తాన్‌పై తనకున్న ప్రేమ కారణంగా ఈ ప్రకటన చేశారు. దాని కారణంగా రెండు దేశాల మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. జస్టిన్ ట్రూడో ఆరోపణల ఫలితంగానే భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ట్రూడో కామెంట్స్ ఇరు దేశాల దౌత్యవేత్తలు కూడా బహిష్కరించే స్థాయికి చేరుకున్నాయి.
అయితే భారత్ పై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. బ్రిటన్, అమెరికా దేశాలకు కెనడాకు సపోర్టు చేస్తాయని ట్రూడో భావించాడు. అమెరికాతో సహా కెనడాకు సన్నిహిత సంబంధాలున్న దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి భారత్ ను ఖండించాలని కోరింది. కానీ రివర్స్ అయ్యింది. కెనడాకు ప్రపంచ దేశాల మద్దతు లభించలేదు. జస్టిస్ ట్రూడో అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. భారత్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలన్న ట్రూడో డిమాండ్ నుంచి చాలా దేశాలు వైదొలిగాయని వాషింగ్టన్ పోస్టులో ఒక నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్ భేటీ.. జగన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని పలువురు సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు లేవనెత్తారని ఒక పాశ్చాత్య అధికారి ఉటంకించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో జరగనున్న మెగా జీ20 సదస్సులో ఈ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించానని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. శిఖరాగ్ర సమావేశం ముగిసిన వారం తర్వాత, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణ చేశారు. కెనడా గడ్డపై 'కెనడియన్ పౌరుడిని' భారత్ హత్య చేసిందని ఆయన అన్నారు.భారత్‌తో సంబంధాల నిర్వహణకు సంబంధించి కెనడా చేసిన ప్రకటనకు కెనడా మిత్రదేశాలు దూరంగా ఉన్నాయి. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే విచారణ పూర్తయ్యే వరకు వ్యాఖ్యానించలేదు.
కెనడా ఆరోపణలపై ప్రపంచం ఏం చెబుతోంది?
మేము కెనడాతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటాము. నేరస్థులకు శిక్ష పడటం ముఖ్యమని వైట్ హౌస్ పేర్కొంది. విచారణ కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నిజనిజాలు నిర్దారణ అయ్యాకే వ్యాఖ్యానించాలి. విచారణ సమయంలో వ్యాఖ్యానించడం సరికాదని యూకె ప్రతినిధి అన్నారు. భారత్ తో వాణిజ్య చర్చలు యథాతథంగా కొనసాగుతాయని.. కెనడా చేస్తున్న ఆరోపణలపై కాన్‌బెర్రా ఆందోళన చెందుతోందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇంతో భారత్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
ఇది కూడా చదవండి: టెన్త్ అర్హత.. 63వేల శాలరీతో ఆర్మీలో జాబ్స్.. డీటైల్స్ చెక్ చేసుకోండి..!
కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుండి దృష్టిని మరల్చేందుకు ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రయత్నిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అవి భారతదేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా మిగిలిపోయాయన్నది. ఈ విషయంపై కెనడా ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడం చాలా కాలంగా ఆందోళనగా ఉందని పేర్కొంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
హర్దీప్ సింగ్ నిజ్జర్, జూన్18లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అతను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్. జూలై 2020లో, UAPA కింద భారతదేశం అతన్ని 'ఉగ్రవాదిగా' ప్రకటించింది. 2016లో నిజ్జర్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. సర్రే స్థానిక పోలీసులు కూడా 2018లో నిజ్జర్‌ను తాత్కాలిక గృహనిర్బంధంలో ఉంచారు, కానీ తరువాత అతన్ని విడుదల చేశారు.
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్.. నేడు జేడీ వాన్స్!
దేశంలో విదేశీ అతిథుల పర్యటనకు వచ్చినప్పుడే ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని అనుమానాలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
🔴Live Breakings: తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more. క్రైం | టెక్నాలజీ | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది.Short News | Latest News In Telugu | తెలంగాణ
SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
వర్షిణి ఏడవకు నేనున్నా నీ భర్తను బయటకు తెస్తా.. | Lawyer Comments On Aghori Arrest | RTV