Ambati Rambabu: నాలుక మడతపడకుండా చూస్కో.. లోకేష్‌కు మంత్రి అంబటి కౌంటర్

నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్‌లో.."నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ ట్వీట్ చేశారు.

New Update
ఢిల్లీ చేరిన 'బ్రో' మూవీ రగడ.. మంత్రి అంబటి వర్సెస్ పవన్

Minister Ambati Rambabu: మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అంటూ సీఎం జగన్ ను (CM Jagan) ఉద్దేశిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ (Lokesh) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన ట్విట్టర్ (X)లో లోకేష్ పై సెటైర్లు వేశారు. "నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ లోకేష్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం అంబటి చేసిన ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు వైసీపీ (YCP) కార్యకర్తలు. మరోవైపు అంబటి చేసిన ట్వీట్ పై విమర్శలు చేస్తున్నారు టీడీపీ (TDP) కార్యకర్తలు. ప్రస్తుతం ట్విట్టర్ లో వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య అంబటి నిప్పు రాజేసినట్లైంది.

శంఖారావం సభలో లోకేష్ చేసిన కామెంట్స్..

పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్‌ సినిమా అంటే సీఎం జగన్‌కు భయం అని అన్నారు. రైతులను చూస్తే జగన్‌కు భయమేస్తోందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీకి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే మంచిదని.. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని అన్నారని తెలిపారు. మూడు రాజధానులు అన్న వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? అని నిలదీశారు.

సాక్షి కాలెండర్ తప్ప.. జాబ్ కాలెండర్ రాలేదు..

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్‌ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచిందని చురకలు అంటించారు. ఐదేళ్లుగా విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి క్యాలెండర్‌ తప్ప.. జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చిందా? ఈ ప్రభుత్వం అని నిలదీశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం పగలగొట్టడం విచారకరం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విగ్రహాలు పగలగొట్టిన వారిని పట్టుకుంటాం అని స్పష్టం చేశారు.

ALSO READ: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు