/rtv/media/media_files/2025/04/26/dsJV2nRbWxTPeLkStEm6.jpg)
Vijay Devarakonda - Allu Arjun
Vijay Devarakonda: టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.
Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్ ది వే..!
మై స్వీట్ బ్రదర్..
హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్ బ్రదర్.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్!" అంటూ అల్లు అర్జున్ హృదయపూర్వకంగా స్పందించాడు.
Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్ ఆనందంతో, ‘‘నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు.
Movies: నాకు ఇష్టమైతే వస్తా.. వైరల్ అవుతోన్న బన్నీ వ్యాఖ్యలు
నాకు ఇష్టమైతే వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో అల్లు అర్జున్. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Allu Arjun: రావు రమేశ్ ప్రధాన పాత్రలో దర్శకుడు లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. దీనికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుకుమార్ సతీమణి బబిత సమర్పణలో ఈ నెల 23న సినిమా విడుదల కానుంది.
ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మై డియర్ ఫ్యాన్స్.. మీరే నాఆర్మీ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోను చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా అన్నారు. దాంతో పాటూ ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా అని అన్నారు బన్నీ. ఈ మాటలు దర్శకుడు సుకుమార్ భార్య బబితను దృష్టిలో పెట్టుకుని చెప్పారు అల్లు అర్జున్. ఆమె పిలవడం వల్లనే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీరిలీజ్‌కు వచ్చానని తెలిపారు.
కానీ అల్లు అర్జున్ మన అనుకుంటే చేస్తా..నాకు నచ్చితే వస్తా అన్న మాటలు ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశారు. దాని కోసం అక్కడకు వచ్చారు కూడా. కానీ తన కుటుంబంలో వ్యక్తే అయిన పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా మాత్రం రాలేదు. అలాగే తర్వాత పవన్ గెలిచినప్పుడు, డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా ఎక్కడా కనిపించలేదు. దీనిపై అల్లు అర్జున్ చాలా ట్రోల్స్‌నే ఎదుర్కొన్నారు. అయితే దీని గురించి బన్నీ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఆ తర్వాత అతను పెద్దగా ఎక్కడా బయట కూడా కనిపించలేదు. దాంతో పాటూ పుష్ప–2 షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారి అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. చెప్పిన సందర్భం వేరైనా..బన్నీ అప్పటి గురించే మాట్లాడారని అంటున్నారు.
Also Read: Andhra Pradesh: రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి అన్నపూర్ణ..
Vijay Devarakonda: "లవ్ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్..
Vijay Devarakonda: టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ... Short News | Latest News In Telugu | సినిమా
Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించాడు. Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇటీవలే ఓ ఈవెంట్ లో నటి సమంత సామ్ తన ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Supritha బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
నటి సురేఖావాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో మరో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బీచ్ లో కాక్ టేల్ తాగుతూ ఫోజులిచ్చింది. Latest News In Telugu | సినిమా
KA Movie 'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్
కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ 'క' చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకి నామినేట్ . Short News | Latest News In Telugu | సినిమా
ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
Indian Army: యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
Pahalgam Terror Attack: టెర్రరిస్టుల అటాక్.. వెలుగులోకి మరొక షాకింగ్ వీడియో - అందరి ముందే కిరాతంగా కాల్చేశారు!
Mohammad Ishaq Dar: చైనా సహాయం కోరిన పాక్.. భారత్‌తో ఏ క్షణమైనా యుద్దం!