Warning For Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక.. ఇలా చేయకపోతే మీ డబ్బులన్నీ పోతాయ్!

కోట్ల మంది ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు CERT-In తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. పలు ఆండ్రాయిడ్‌ వెర్షన్లలో లోపాలను గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ యూజర్లకు కీలక సూచనలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Warning For Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక.. ఇలా చేయకపోతే మీ డబ్బులన్నీ పోతాయ్!

Android Users Alert : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఆండ్రాయిడ్ వినియోగదారులకు(Android Users) హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ వెర్షన్లలో అనేక భద్రతా లోపాలు కనుగొన్నారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం వినియోగదారులను హెచ్చరించింది. ఇటీవలి రిలీజ్‌ అయిన ఆండ్రాయిడ్ సిస్టమ్‌ల వల్ల మొబైల్‌(Mobile) లోని సున్నితమైన సమాచారాన్ని నేరగాళ్లు చోరీ చేయవచ్చు. అంతేకాదు మన మొబైల్‌పై మొత్తం అధికారాన్ని పొందచ్చు. అంటే ఫోన్‌ మనది.. ఆపరేటింగ్‌ మాత్రం నేరగాళ్లదన్నమాట.

--> ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, ఏఎమ్‌లాజిక్, ఆర్మ్ కాంపోనెంట్‌లు, మీడియాటెక్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌ల భద్రతాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12 ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లతో సహా ఆండ్రాయిడ్‌కు చెందిన మల్టీ వెర్షన్లలో లోపాలు ఉన్నట్టు CERT-In గుర్తించింది. అలాగే ఇది ఆండ్రాయిడ్‌-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌(Android Based Smartphone) లతో పాటు టాబ్లెట్‌లు కూడా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులకు వారి డివైజ్‌లో అందుబాటులో ఉన్న తాజా భద్రతా ప్యాచ్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. తెలియని సోర్సెస్‌ నుంచి వచ్చే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదని లేదా తెలియని మెయిల్స్‌ నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయకుండా ప్రజలకు సలహా ఇస్తుంది.

ఇలా చేయండి:

--> మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌(Tablet) లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

--> సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లపై నొక్కండి.

--> ఆపై అప్‌డేట్‌ కోసం చెక్‌ బటన్‌ను నొక్కండి.

--> అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లయితే, ఇన్‌స్టాల్ నొక్కండి.

--> ఇది డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి.

--> పూర్తయిన తర్వాత, ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

Also Read : రేవంత్‌రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

Advertisment
Advertisment
తాజా కథనాలు