APPSC : ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

APPSC Group 1 & 2 Notifications Update: ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇస్తామని, గ్రూప్ 1 లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ (APPSC) తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

2022 గ్రూప్ 1 ప్రక్రియ రికార్డుస్థాయిలో 9 నెలల్లో పూర్తి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రూప్ 1 ప్రక్రియ కూడా 9 నెలల్లోనే పూర్తి చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో రెండు పేపర్లస్థానంలో ఒకే పేపర్ ఉంటుందని..గ్రూప్ వన్ మెయిన్స్ లో 5 పేపర్లకు బదులుగా 4 ఉంటాయని తెలిపారు. ఇందులో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో 2 పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని వెల్లడించారు.

లాంగ్వేజ్ లో రెండు పేపర్లకు బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందని తెలిపారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: 35 మందితో బీజేపీ మూడో జాబితా.. ఆ కీలక నేతలకు నో టికెట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు