Group-1: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌..తప్పుల సవరణకు శనివారం నుంచి ఛాన్స్..!

గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు.

New Update
TSPSC: తెలంగాణ గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్‌.. లిస్ట్ రిలీజ్!

Group-1: గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ లో పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే వాటిని ఈనెల 27వ తేదీ వరకు సరిదిద్దుకోవచ్చని ఈ సందర్భంగా టీఎస్సీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించింది. అయితే చివరి రోజు సర్వర్ మొరాయించింది. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఫలితంగా 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కేవలం 2.7 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈనెల 16వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి 4.03లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి:  టీ20 క్రికెట్‌లో విరాట్ పేరిట చారిత్రక రికార్డు..తొలి భారతీయుడిగా మ‌రో ఘ‌న‌త‌..!

Advertisment
Advertisment
తాజా కథనాలు