Alcohol: మద్యం తాగే మహిళలు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి.. లేకపోతే అంతే పని!!

మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. మహిళలు ఒక రోజులో 90ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది భవిష్యత్‌లో వారికి సంతానోత్పత్తి సమస్యలను తీసుకొస్తుంది. లైంగిక సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఊబకాయాన్ని పెంచుతుంది.

New Update
Alcohol: మద్యం తాగే మహిళలు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి.. లేకపోతే అంతే పని!!

Alcohol: చాలా మందికి తలెత్తే ప్రశ్న ఏంటంటే పురుషుల కంటే మహిళలు మద్యం సేవించే విధానం, లిమిట్‌ భిన్నంగా ఉంటుందా.. అసలు మహిళల స్టామినా ఎంత వరకు అనేది వస్తుంటుంది. కొందరు స్నేహితులతో పార్టీలు చేసుకుంటే..మరికొందరు మహిళలు పబ్‌లకు వెళ్లి మద్యం తాగడానికి ఇష్టపడతారు. అయితే మహిళలకు ఎంత మద్యం సరిపోతుంది, మగవారితో పోలిస్తే ఎంత లిమిట్‌లో తాగుతారనే విషయాలు తెలుసుకుందాం.

ఆడవాళ్లు మద్యం లిమిట్‌ ఎంత?

  • మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. అయినా కొందరు పార్టీల్లో ఎక్కువగా మద్యం సేవించేందుకు ఇష్టపడతారు. ఓ నివేదిక ప్రకారం పురుషుల కంటే మహిళలకు అధిక పరిమితి ఉందని తేలింది. మగవారి కంటే కూడా ఎక్కువ మద్యం తాగుతారని అంటున్నారు. కానీ మహిళలు ఒక రోజులో 60 నుంచి 90 ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరని, భవిష్యత్‌లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ఊబకాయాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. పురుషులు, మహిళలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం సేవించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

మానసిక సమస్యలు తప్పవు:

  • మరో పరిశోధన ప్రకారం.. మద్యం సేవించిన తర్వాత పురుషులు బలంగా భావిస్తారు. వాళ్లంత బలశాలి మరోకరు ఉండరనే భావనలో ఉంటారు. లైంగికపరంగా కూడా రెచ్చిపోతుంటారు. కానీ మద్యం ఎక్కువగా తాగే మహిళలు ఒత్తిడి తగ్గుతుందని భావిస్తుంటారు. వైద్యులు చెబుతున్నదాని ప్రకారం మద్యం సేవించడం వల్ల ఒత్తిడి తగ్గదని, లైంగిక సామర్థ్యం కూడా క్షీణిస్తుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో తక్షణం ఎనర్జీ ఇచ్చే డ్రింక్‌.. తాగితే వదలరు..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు