USA: తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు..

ప్రపంచంలో మొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను వాడి ఓ దోషికి మరణశిక్ష విధించారు. 1988లో అమెరికాలో ఓ మతాధికారి భర్య ఎలిజబెత్ సెనట్‌ను మర్డర్ చేసిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే దోషికి ఈ మరణశిక్షను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.

New Update
USA: తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు..

ప్రపంచంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి ఓ ఖైదీకి మరణ శిక్ష విధించారు. 1988లో అమెరికాలో ఓ మతాధికారి భర్య ఎలిజబెత్ సెనట్‌ను మర్డర్ చేసిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే దోషికి ఈ మరణశిక్షను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే స్మిత్‌ తన మరణ శిక్షకు ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు అలబామ మానవత్వాన్ని ఒక అడుగు వెనక్కి తీసుకెళ్తోందని.. నాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలని చెప్పాడు. అనంతరం అధికారులు స్మిత్‌కు మాస్క్‌ను బిగించి.. దానిలో నైట్రోజన్ గ్యాస్‌ను పంపించారు. ఏడు నిమిషాల్లో అతడికి మరణ శిక్ష పూర్తైనట్లు అధికారులు తెలిపారు. వ్యవస్థలో లోపాలను వినియోగించి దాదుపు 30 ఏళ్ల పాటు తప్పించుకున్నాడని.. చివరికి తన నేరానికి బాధ్యత వహించాడని అలబామా గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

ఏంటీ కేసు..
ఇక వివరాల్లోకి వెళ్తే.. అలబామాలోని కొల్బెర్ట్‌ కౌంటీలో ఛార్లెస్‌ సెనెట్‌ అనే పాస్టర్‌ ఎక్కువగా అప్పులు చేశాడు. దీంతో భార్య ఎలిజబెత్‌ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్ము వస్తుందని అనుకున్నాడు. ఆమెను చంపడానికి గ్రే విలియమ్స్‌ అనే వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చాడు. అలాగే 1,000 డాలర్ల చొప్పున సుపారీ ఇచ్చి.. కెన్నెత్‌ స్మిత్‌, జాన్‌ ఫ్రాస్ట్‌ పార్కర్‌కు ఈ పని అప్పగించాడు. వాళ్లు 1988 మార్చిలో ఎలిజబెత్‌ను హత్య చేశారు.

Also read: మైక్రోసాఫ్ట్‌ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే!

భార్యను హత్య చేయించి ఆత్మహత్య

ఈ కేసులో పోలీసులు భర్త ఛార్లెస్‌ను అనుమానించి దర్యాప్తు చేశారు. దర్యాప్తు అధికారుల బృందం నోటి నుంచి హంతకుల పేర్లు బయటకు రావడంతో తాను దొరికి పోయినట్లు భావించాడు. విచారణ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి అక్కడే తన కుటుంబాన్ని కలుసుకొన్నాడు. తాను నేరం చేసినట్లు వారికి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలిజబెత్‌ మరణించిన ఎనిమిది రోజులకు అతడు ఇలా సూసైడ్ చేసుకున్నాడు. ఆ దంపతుల మృతదేహాలను ఒకే చోట సమాధి చేశారు.

ఈ కేసులో మరో దోషి అయిన గ్రే విలియమ్స్‌కు జీవితఖైదు విధించగా.. అతడు జైల్లోనే మృతి చెందాడు. కిరాయి హంతకుల్లో ఒకడైన జాన్‌ ప్రాస్ట్‌కు 2010లో మరణశిక్షను అమలు చేశారు. అయితే మరో నిందితుడు స్మిత్‌ మాత్రం ఎలిజబెత్‌ హత్య సమయంలో తాను అక్కడే ఉన్నానని.. కానీ ఈ దాడిలో పాల్గొనలేదని వాదిస్తూ కొన్నేళ్లపాటు న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. ముందుగా 2022లో విషపూరిత ఇంజెక్షన్‌ ఇచ్చి అతడికి మరణశిక్షను అమలు చేయాలని కోర్టు అనుకుంది. కానీ.. అటువంటి ఇంజెక్షన్‌ను సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. ఈ లోపు డెత్‌ వారెంట్‌ ముగిసిపోయింది. దీంతో గతంలో ఎన్నడూ పరీక్షించని మరణశిక్ష విధానాన్ని ఇతడిపై ప్రయోగించాలని జడ్జి సూచించారు. ఇందుకోసం స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను ఎంపిక చేసుకొని ఇప్పుడు మరణ శిక్షను అమలు చేశారు.

Also Read: పాకిస్తానీలను చంపింది భారత ఏజంట్లే..భారత్‌ పై పాక్‌ సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు