Rajinikanth : రజినీకాంత్ కు విలన్ గా నాగార్జున.. ఊర మాస్ కాంబో సెట్ చేసిన డైరెక్టర్..! రజినీకాంత్ హీరోగా 'కూలీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రజినీకాంత్ కు సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. By Anil Kumar 24 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Akkineni Nagarjuna In Rajinikanth Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 'కూలీ' (COOLIE) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ కూడా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ స్టార్ నటుడు మరెవరో కాదు, అక్కినేని నాగార్జున. నాగార్జున విలన్ గా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రజినీకాంత్ కు సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాగా నాగ్ఇంతకుముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్ కనిపించి అలరించాడు. ఇప్పుడు మరోసారి విలన్ రోల్ చేస్తున్నాడని, అది కూడా రజినీకాంత్ సినిమాలో అనే న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. Also Read : ‘KGF’ యూనివర్స్ లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ నీల్ తో ఏకంగా రెండు సినిమాలు? రజినీకాంత్ కు 171వ సినిమా... 'కూలీ' రజినీకాంత్ కు 171వ సినిమా. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున నిజంగానే విలన్ పాత్రలో నటిస్తున్నాడా? లేదా? అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. Also Read: గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..! #rajinikanth #lokesh-kanagaraj #akkineni-nagarjuna #coolie-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి