Akhilesh Yadav: మొదలైన లుకలుకలు..కాంగ్రెస్ పై మండిపడుతున్న అఖిలేశ్! ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తుందని ఇతర పార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన కార్యాకలాపాలను సాగిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 20 Oct 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Akhilesh Yadav Warning for Congress: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Govt) ను గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్షాలు అని కలిసి ఇండియా కూటమిని (INDIA Alliance) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కూటమి గోడలకు బీటలు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన తీరుతో ఇతర పార్టీల నేతలకు తలనొప్పి తెప్పిస్తుంది. Also read: వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తుందని ఇతర పార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress) తన కార్యాకలాపాలను సాగిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మిత్రుల మీదనే కాంగ్రెస్ పార్టీకి పోటీకి దిగుతుందని ఆయన తెలిపారు. దీని వల్ల కాంగ్రెస్ ఇండియా కూటమిలోని ధర్మానికి నీళ్లు వదిలి తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ కూటమిలోని ఇతర పార్టీలను మోసం చేస్తుందని అఖిలేశ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తుందని తెలిస్తే అసలు ఇండియా కూటమిలో చేరడం గురించి ఆలోచించేవారమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తుంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Assembly Elections) ఇంకా ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా రావడం లేదని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపడం గురించి తరువాత ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు. మధ్య ప్రదేశ్ లో ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు మొత్తం 18 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. దీని వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని వారు ఆరోపిస్తున్నారు. దీని వల్ల బీజేపీకే లాభం ఉంటుంది తప్ప ఇండియా కూటమికి ఏం ప్రయోజనం ఉండదని ఆయన ఆరోపిస్తున్నారు. మధ్య ప్రదేశ్ ఎన్నికల గురించి ముందుగానే కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తో మాట్లాడాము. ఇంతకు ముందు తాము గెలిచిన స్థానాలు, రెండో స్ధానంలో నిలిచిన నియోజక వర్గాల జాబితాను ఆయనకు అందజేసినట్లు వివరించారు.అన్ని వివరాలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ తాము సీట్లు గెలిచిన చోట కూడా వారి అభ్యర్థులను నిలబెట్టినట్లు ఆయన వివరించారు. Also Read: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు #congress #bjp #akhilesh-yadav #i-n-d-i-a #samajwadhi-party #madhyapradesh-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి