Akbaruddin Owaisi: మమ్మల్ని హత్య చేస్తారు.. అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

TS: కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్‌ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు.

New Update
Akbaruddin Owaisi: మమ్మల్ని హత్య చేస్తారు.. అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Raja Singh Vs Akbaruddin Owaisi: లోక్ సభ ఎన్నికల వేళ పాతబస్తీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్‌ ఒవైసీ. కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని అన్నారు. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మేం చాలా బలంగా ఉన్నాం అని చెప్పారు. అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది మేమే అని అక్బరుద్దీన్‌ భరోసా వ్యక్తం చేశారు.

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్..

లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో మేమె గెలుస్తున్నాం.. మా బ్రదర్స్ ని చంపాలని చూస్తున్నారని అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి ముస్లింలను మోసం చేసేందుకు అక్బరుద్దీన్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2029లో అధికారం బీజేపీదే (BJP)  అని ధీమా వ్యక్తం చేశారు. మీ అన్నదమ్ములు అప్పుడు వంగి మా కాళ్లు పట్టుకుంటారు.. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మీరు వారి కాళ్లు పట్టుకొని దందాలు చేస్తారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తాం అంటూ హెచ్చరించారు.

Also Read: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam ప్రకృతి అందాలతో పహాల్గమ్.. ఇక్కడ టాప్ 10 పర్యాటక ప్రదేశాలు చూస్తే మతిపోతుంది!

నిన్న జరిగిన ఉగ్రవాద దాడితో జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ ప్రదేశం పేరు మారుమోగుతోంది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులతో ఉత్సాహభరితమైన ప్రకృతి దృశ్యాలను తలపిస్తుంది. పహాల్గమ్ లోని కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

Advertisment
Advertisment