Aishwarya Rai: ఏ మాత్రం తగ్గని ఐశ్వర్యారాయ్ క్రేజ్‌.. ఈ వయసులోనూ ఏం చేసిందంటే..?

ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. ప్యారిస్ లో యువ ఫ్యాషన్ మోడళ్లతో కలిసి సమానంగా ఈ వయసులోనూ క్యాట్ వాక్ చేసి జోష్ నింపారు అందాల రాశి ఐశ్వర్య రాయ్‌. ఈ వీడియో చూసిన అభిమానులు..అందమా అందుమా..అందనంటే అందమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Aishwarya Rai: ఏ మాత్రం తగ్గని ఐశ్వర్యారాయ్ క్రేజ్‌.. ఈ వయసులోనూ ఏం చేసిందంటే..?

ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai Bachchan) అందం ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు. ప్యారిస్ లో యువ ఫ్యాషన్ మోడళ్లతో కలిసి సమానంగా ఈ వయసులోనూ క్యాట్ వాక్ చేసి అభిమానులను సందడి చేశారు అందాల రాశి ఐశ్వర్య రాయ్‌. ఈ వీడియో చూసిన అభిమానులు..అందమా అందూమా..అందనంటే అందమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐశ్వర్యారాయ్ కు 49 ఏళ్లు. 12 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు తల్లి. వయసు అనేది కేవలం ఒక నంబర్ అని ఎక్కువ మంది నటీనటులు నమ్ముతుంటారు. ఐశ్వర్య అంత పెద్ద వయసులోనూ చలాకీగా క్యాట్ వాక్ చేయడం చూసే వారికి ఆసక్తిని కలిగించింది.ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లోకి చేరాయి. ఐశ్వర్య వయసు తగ్గిందా? అన్నట్టుగా ఆమె ప్రదర్శన కనిపించింది. బ్రౌన్, గోల్డెన్ డ్రెస్ ధరించి, హెయిర్ కలర్ ను కూడా అందుకు అనుగుణంగా మార్చేశారు. ఆడియన్స్ చూసి ఐశ్వర్యారాయ్ చిలిపిగా కన్ను కొట్టడమే కాదు, ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఔరా అనిపించింది.

1999లో ‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ అనే సినిమా షూటింగ్‌లో ఐశ్వర్య, అభిషేక్ మొదటిసారి కలుసుకున్నారు. అప్పటినుంచి వారు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. 2006లో వారు కలిసి నటించిన ‘ఉమ్రవ్ జాన్’ అనే చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2007లో ముందుగా తన మనసులోని మాటను అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‌కు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి ఐశ్వర్య కూడా వెంటనే ఓకే చెప్పేసింది. అదే ఏడాది వీరిద్దరికీ పెళ్లి కూడా జరిగింది. 2011లో వారికి ఆరాధ్య పుట్టింది. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించిన ఐశ్వర్య.. ఇప్పుడు పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌పైనే ఫోకస్ పెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు