బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్?

ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ల విడాకులకు సంబంధించి మరోసారి న్యూస్ వైరల్ అవుతోంది. కొంతకాలంగా బచ్చన్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది, కూతురు ఆరాధ్య, భార్య ఐశ్వర్యల బర్త్ డే పార్టీలకు అభిషేక్ హాజరుకాకపోవడంతో దీనికి మరింత బలం చేకూరింది.

New Update
బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్?

Aishwarya: బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ (Aishwarya - Abhishek) దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోసారి విడాకుల (Divorce) ఇష్యూ చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా బచ్చన్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని, ఐశ్వర్య- అభిషేక్ లు ఎడమోహం పెడమొహంగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫ్యామిలీలో గొడవలు..
అంతేకాదు ఇటీవల ఆరాధ్య బర్త్ డే పార్టీలోనూ అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ వార్తలకు మరింత బలం చేకూరుంది. 'వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా విడివిడిగా జీవిస్తున్నారు. అభిషేక్, ఐశ్వర్య చాలా కాలంగా కలిసి ఎక్కడికి వెళ్లట్లేదు. ఆరాధ్య కోసం కలిసినా ఆమె పుట్టినరోజు వేడుకల్లో అభిషేక్ లేడు. ఐశ్వర్య తన పుట్టినరోజును ఆరాధ్య, తన ఫ్యామిలీతో జరుపుకుంది' అంటూ పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ న్యూస్ వైరల్ కాగా మరిన్ని పుకార్లు రెట్టింపు అయ్యాయి.

ఇది కూడా చదవండి : Hanuman Voice: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ..

బెస్ట్ హస్బెండ్..
అయితే గతంలోనూ తమ మధ్య విభేదాల వార్తలపై స్పందించలేదు. కానీ తాజాగా ఐశ్వర్య ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ఆయన తన 'బెస్ట్ హస్బెండ్' అని చెప్పింది. అభిషేక్‌పై తన పట్ల గొప్ప ప్రేమను కలిగివుంటాడని, ఏరోజు తనను ఇబ్బంది పెట్టలేదంటూ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు ఇటీవల ముంబైలో కబడ్డీ మ్యాచ్ కు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యలతోపాటు ఐశ్వర్య కూడా తమ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతుండగా డివోర్స్ పుకార్లకు చెక్ పడింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఐశ్వర్య రాయ్ చివరిగా మణిరత్నం చిత్రం 'పొన్నియన్ సెల్వన్‌'తో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ఐశ్వర్య నటనకుగానూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అభిషేక్ చివరగా 'ఘూమర్‌'లో కనిపించాడు. ఈ సినిమాలో కోచ్‌గా నటించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు చేయలేకపోయినప్పటికీ కథ, నటన పరంగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది.

New Update
hansika

hansika Photograph: (hansika)

Hansika: గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 

హన్సిక ఫ్యామిలీపై కేసు..

ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్‌ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా సెక్షన్ 498A కేసును రద్దు చేయాలంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ మోడక్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

 

https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY

domestic-voilence | mumbai | high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment