Air India : ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా

మాస్ సిక్ లీవ్ పెట్టిన ఉద్యోగుల మీద ఎయిర్ ఇండియా చర్యలు మొదలుపెట్టింది. మొదటగా 25 మందికి టెర్మినేషన్ లెర్లను పంపించింది. మరికొంత మందికి సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాలంటూ అల్టిమేటం లెటర్లను జారీ చేసింది.

New Update
Air India : ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా

Air India Employee Mass Sick Leave : ఎయిర్‌ ఇండియా(Air India) ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్‌ లీవ్‌(Sick Leave) పెట్టారు. ఏకంగా ఒకేసారి 200మంది దాకా సిక్‌ లీవులు పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్‌ సిబ్బంది అంతా కూడా ఒకేసారి చివరి నిమిషంలో సిక్‌ లీవ్‌ పెట్టడంతో మంగళవారం రాత్రి నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదరుయ్యాయి. ఇప్పుడు ఈ చర్య మీద ఎయిర్ ఇండియా సంస్థ భారీ యాక్షన్ తీసుకుంది.

ఇక ఇంటికి వెళ్ళండి...

నిన్న ఒకేసారి ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టిన చర్యకు ఎయిర్ ఇండియా కూడా భారీగానే యాక్షన్ తీసుకుంది. లీవ్‌లో ఉన్న 25 మంది ఉద్యోగులను తొలగిస్తూ టెర్మినేషన్ ఎలర్లను ఇచ్చింది. దాంతో పాటూ మరికొంతమందికి సాయంత్రంలోగా జాయిన్ అవ్వాలంటూ అల్టిమేటం లెటర్లు పాస్ చేసింది. సరైన కారణం లేకుండా సెలవు పెట్టినందువల్లనే ఉద్యోగాలను నుంచి తొలగిస్తున్నట్లు చెప్పింది ఎయిర్ ఇండియా సంస్థ. ఇంతలా మాస్‌ లెవల్లో సిక్ లీవ్ తీసుకోవడం నింబధనలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఉద్యోగుల చర్యవలన చాలా మందికి బ్బంది కలగడమే కాకుండా..కంపెనీకి కూడా చాలా నష్టం కలిగించిందని తెలిపింది. ఉద్యోగుల సిక్ లీవ్ కారణంగా నిన్న దాదాపు 90 విమానాలు రద్దు అయ్యాయి. ఇవాళ కూడా జాతీయం, అంతర్జాతీయంగా చాలా ఫ్లైట్లు తిరగడం లేదు.

మరింత తగ్గిస్తాము..

ఎయిర్ ఇండియా సంస్థ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 360 దాకా తిరుగుతాయి. వీటిల్లో నిన్న 90 ఫ్లైట్లను రద్దు చేశారు. ఉద్యోగులు(Employees) ఇంకా డ్యూటీల్లోకి రాలేదు. వాళ్ళ మాస్ సిక్ లీవ్ గొడవ నడుస్తూనే ఉంది. అందుకే మరి కొన్ని రోజులు విమానాలు రద్దు చేస్తాము అని తెలిపారు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) అలోక్ సింగ్. అన్ని విమానాల షెడ్యూల్‌కు ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. కొన్నింటిని రద్దు చేయకతప్పదని అలోక్ అంటున్నారు.\

Also Read:Hyderabad: మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు