పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు.. వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ముష్కరులు పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పంజాబ్ ప్రావిన్సులోని మియన్వాలిలో ఉన్న వైమానిక స్థావరంలోకి పలువురు ముష్కరులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తిప్పికొట్టిన పాక్ సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేసినట్లు తెలిపింది. By B Aravind 04 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలి ప్రాంతంలో వైమానిక స్థావరంపై ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు తమ బాధ్యతేనని తెహ్రీక్ ఇ జిహాద్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావంరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడ్డారు. అయితే ఈ దాడులను ప్రతిఘటించిన పాక్ సైన్యం ముగ్గురు ముష్కరుల్ని హతం చేసింది. అలాగే మరో ముగ్గుర్ని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులు జరిగే సమయానికి తమ భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై వారి కుట్రల్ని భగ్నం చేసినట్లు పేర్కొంది. ఇక ఈ దాడుల్లో మూడు యుద్ధ విమానాలు, ఓ ఇంధన ట్యాంకర్ ధ్వంసమయ్యాయని.. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపింది. అయితే భద్రతా సిబ్బందికి సంబంధించి ప్రాణనష్టం గురించి చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ఈ దాడికి బాధ్యత వహించిన తేహ్రీక్ ఇ జిహాద్ ఉగ్రవాద సంస్థ ఈ ఏడాది జులైలో కూడా బలోచిస్తాన్‌లోని సైనిక స్థావరంపై దాడులు చేసింది. ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. Also Read: భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య Also read: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు #telugu-news #pakistan #terrorist-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి