ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. Realme 14T 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6,000mAh బ్యాటరీతో వచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు ఈ Realme 14T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.
Realme 14T 5G Price
Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సర్ఫ్ గ్రీన్, లైటింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కొనుగోలు పై ఫ్లాట్ రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందుతారు. అదే సమయంలో రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. దీనిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు.
Realme 14T 5G Specifications
Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits హై బ్రైట్‌నెస్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో RAMని వర్చువల్ RAMతో 10GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6పై పనిచేస్తుంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
14T 5G ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50D40 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ సోనీ IMX480 ఫ్రంట్ కెమెరా ఉంది. వీటితో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, హైబ్రిడ్ మైక్రో SD స్లాట్ ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లు అందించారు.
tech-news | telugu tech news | tech-news-telugu