WhatsApp: వాట్సాప్ అప్ డేట్ లో ఏఐ ఫీచర్లు! వాట్సాప్‌లో త్వరలోనే ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ) ఫీచర్లను ప్రవేశపెట్టబోతున్నట్టు మెటా సంస్థ ప్రకటించింది. వాట్సాప్‌లో ఏఐ చాట్ బాట్ ఇంటర్‌ఫేస్‌తో పాటు ఏఆర్ కాలింగ్ ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది. ఇవి ఎలా ఉపయోగపడతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 01 Jul 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AI And AR Features in WhatsApp: ఏఆర్ ద్వారా యూజర్లు వీడియో కాలింగ్ టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఏఆర్ ఇంటర్‌ఫేస్ సాయంతో యూజర్లు వీడియో కాల్స్ చేసుకునేటప్పుడు డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్‌లను ఉపయోగించుకోవచ్చు. అలాగే రకరకాల లైట్ ఎఫెక్ట్‌లతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను వాట్సాప్ బీటా ఇన్ఫో షేర్ చేసింది. ఇకపోతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగా వాట్సాప్‌లోనూ మెటా ఏఐ (Meta AI) సపోర్ట్ ఫీచర్ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ సాయంతో మెరుగైన చాటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు క్రియేటివ్ కంటెంట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఉండగా ఏదైనా విషయంపై రీసెర్చ్ చేయాల్సి వస్తే యాప్ నుంచి బయటకు వెళ్లకుండా వాట్సాప్‌లోనే ఏఐ బాట్ ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు. గ్రూప్ చాట్‌లు, ప్రమోషనల్ పోస్టుల్లో ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వీటితోపాటు వాట్సాప్.. ‘ఇన్-యాప్ డయలర్’ అనే మరో ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. వాట్సాప్ యాప్‌ను క్లోజ్ చేయకుండానే నార్మల్ కాల్స్ చేసుకునేలా ఈ ఫీచర్ అనుమతిస్తుంది. దీనికోసం వాట్సాప్‌లో కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కూడా అందుబాటులోకి రానుంది. Also Read: నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు నిషేధం..నితిన్ గడ్కరీ! #whatsapp #meta-ai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి