Imran Khan: నిర్దోషులుగా తేలిన పాక్ మాజీ ప్రధాని దంపతులు రూల్స్‌కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఊరట లభించింది. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వాళ్లపై అభియోగాలను తోసిపుచ్చుతూ దంపతులను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. By B Aravind 13 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి రూల్స్‌కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఊరట దక్కింది. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వాళ్లపై అభియోగాలను తోసిపుచ్చింది. దంపతులను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. దీంతోపాటు ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేసింది. Also read: ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ విరాళం.. ! బుష్రా బీబీ మొదటి భర్త అయిన ఖవార్ ఫరీద్ పెట్టిన కేసుపై గతంలోనే ట్రయల్ విచారణ చేసింది. తన మాజీ భార్య రూల్స్ ఉల్లంఘించిందని ఫరీద్ ఆమెపై కేసు పెట్టాు. పెళ్లికి ముందునుంచే.. బుష్రా, ఇమ్రాన్‌ల మధ్య బంధం కొనసాగినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో బుష్రా బీబీ నుంచి ఫరీద్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె 2018లో ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇదిలాఉండగా.. ఇమ్రాన్ ఖాన్‌పై పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొన్నింటిలో ఆయన దోషిగా తేలారు. మరికొన్నింటిలో విచారణ కొనసాగుతోంది. అయితే పెళ్లికి సంబంధించిన కేసులో నిర్దోషిగా తేలినా కూడా ఆయన ఇంకా జైల్లోనే ఉండనున్నారు. Also read: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు #telugu-news #imran-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి