Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ వరద బీభత్సం.. 68 మంది మృతి!

ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేలాది ఇళ్ళు.. ఆఫీసులు దెబ్బతిన్నాయి. వందల హెక్టార్ల వ్యాసాయ భూమి వరదల్లో మునిగిపోయాయి. వరద బీభత్సానికి 68 మంది మరణించారు. 

New Update
Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ వరద బీభత్సం.. 68 మంది మృతి!

Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు చోట్ల భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల్లో కనీసం 68 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోర్ ప్రావిన్స్‌లో 50 మంది చనిపోయినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ హమాస్ తెలిపారు. ఈ వరదల్లో రాజధాని ఫిరోజ్ కోతో సహా వివిధ ప్రాంతాల్లో వేలాది ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని, వందల హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతినడంతో ప్రావిన్స్ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆయన అన్నారు.

300 మందికి పైగా మృతి..
Afghanistan Floods: ఇదిలా ఉండగా, ఉత్తర ప్రావిన్స్‌లోని ఫర్యాబ్‌లో శుక్రవారం 18 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు. నాలుగు జిల్లాల్లో ఆస్తి, భూమి దెబ్బతిన్నాయని, 300కు పైగా జంతువులు చనిపోయాయన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అసాధారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు 300 మందికి పైగా మరణించారని, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ గత వారం తెలిపింది.

Also Read: కిర్గిస్థాన్‌లో హింసాత్మక ఘటన.. భారత విద్యార్థులకు కేంద్రం ఆదేశాలు

గతవారంలో..
Afghanistan Floods: గత వారం, భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని గ్రామాలను నాశనం చేశాయి.  315 మంది మరణించారు.  1,600 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ఆదివారం తెలిపారు. బుధవారం ఘోర్ ప్రావిన్స్‌లో నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే ప్రయత్నంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆఫ్ఘన్ వైమానిక దళం ఉపయోగించే హెలికాప్టర్ కూలిపోయిందని, ఒక వ్యక్తి మరణించగా, 12 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు