Addanki Dayakar : లఫూట్, చేతగాని దద్దమ్మ.. భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడు? ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. By srinivas 05 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Adilabad : ప్రధాని మోడీ(PM Modi) వ్యక్తిగత, రాజకీయం జీవితంపై టీపీసీసీ(TPCC) ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar) సంచలన కామెంట్స్ చేశారు. అంబానీ, అదానీలు దేశాన్ని దోచుకుంటుంటే మోడీ ఒక చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అద్దంకి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లఫుట్ గాడ్ని పక్కన పెట్టుకొని.. మన దేశ ప్రధాని మోడీ ఏక్ నిరంజన్. భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలి. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడ్ని భద్రాద్రి రామలయంలో పెట్టుకున్నాం. కానీ మోడీ మాత్రం ఏడ్చే రాముడు, బాల రాముడు అని చెప్పి అయోద్యలో పెట్టాడు. దాని పక్కన బాబ్రీ మసీదు కట్టుకుంటుంటే ముస్లింల మీద విషం చిమ్ముతున్నారు. పాకిస్థాన్ పొమ్మంటే నా దేశం పాకిస్థాన్ కాదు. నేను ఈ దేశంలోనే పుట్టిన. ఈ దేశవాసిని అన్న ముస్లింలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. మోడీ అనేవాడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా అనే లఫూట్ గాడ్ని పక్కన పెట్టుకొని ఈ దేశాన్ని దోచుకుంటున్నాడు' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: Life Style: గర్భధారణకు సరైన వయస్సు ఏది? లేట్ ప్రెగ్నెన్సీ ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..? అలాగే తినే పప్పు, ఉప్పు, చపాతీ, పెరుగు మీద పన్ను వేసి 120 కోట్ల మంది హిందువులను దోచుకుంటున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్లలు చేసిన రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, రేపు దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మన ప్రథమ కర్తవ్యమన్నారు. #pm-modi #amit-shah #addanki-dayakar #tpcc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి