/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T123658.334-jpg.webp)
కానీ వీరిద్దరూ ఇంతవరకూ తమ రిలేషన్ గురించి ఎక్కడ ఓపెన్ కాలేదు. అయితే రీసెంట్ గా కరణ్ జోహార్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'కు హాజరైన ఆదిత్యరాయ్ తమ పర్సనల్ అండ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
View this post on Instagram
ఈ మేరకు 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8'(Koffee With Karan Season 8) తాజా ఎపిసోడ్ కు అర్జున్ కపూర్‌తో పాటు పాల్గొన్న ఆదిత్యను.. ‘అనన్యతో నువ్వు డేటింగ్ చేస్తున్నావని రూమర్స్ వస్తున్నాయి. నీ సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఏమంటారు?' అని కరణ్ ప్రశ్నించారు.
దీంతో ‘మీరు నన్ను రహస్యాలు అడగొద్దు. నేను కచ్చితంగా అబద్ధాలే చెబుతాను. దయచేసి మరో ప్రశ్న అడగండి’ అంటూ ఆదిత్య క్లారిటీ ఇవ్వకుండానే తప్పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా డిసెంబర్ 14న డిస్నీ+హాట్ స్టార్ వేదికగా పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇది కూడా చదవండి : ఉమ్మడి ఏపీ భవన్ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే
ఇక గత నెలలో ఈ షోకు అటెండ్ అయిన అనన్య.. తమ రిలేషన్‌షిప్ గురించి ఆమె మాట్లాడింది. ఆదిత్య తనకు మంచి స్నేహితుడని, అన్ని విషయాల్లోనూ సపోర్టుగా ఉంటాడని చెప్పింది. ఇక ఆదిత్య, అనన్య ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు.