2వ హాలో ఆర్బిట్‌లో ఆదిత్య ఎల్1 ప్రకటించిన ఇస్రో! సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌక విజయవంతంగా రెండో హాలో ఆర్బిట్‌ను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. By Durga Rao 03 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని, సూర్యుడి నుండి వెలువడే అయానైజ్డ్ కణాల స్వభావం పరిమాణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను గత ఏడాది సెప్టెంబర్ 2న ప్రయోగించింది. ఇది జనవరి 6న భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజియన్ పాయింట్‌గా పిలిచే ఎల్1 పాయింట్‌కి చేరుకుంది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక హాలో ఆర్బిట్‌లో తొలి కక్ష్యను పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. Aditya-L1: Celebration of First Orbit Completion 🌞🛰️ Today, Aditya-L1 completed its first halo orbit around the Sun-Earth L1 point. Inserted on January 6, 2024, it took 178 days, to complete a revolution. Today's station-keeping manoeuvre ensured its seamless transition into… pic.twitter.com/yB6vZQpIvE — ISRO (@isro) July 2, 2024 వ్యోమనౌక ఈ కక్ష్యను పూర్తి చేయడానికి 178 రోజులు పట్టింది. ఇప్పుడు అంతరిక్ష నౌక రెండవ హాలో కక్ష్యలో విజయవంతంగా తన మార్గాన్ని మార్చుకుంటుందని..సాఫీగా ప్రయాణిస్తోందని ఇస్రో తన X పేజీలో పేర్కొంది. #isro #aditya-l1 #sun మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి