Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్‌ లో ఉండడంతో!

నటి స్నేహ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె పర్సనల్‌ లైఫ్‌ గురించి, భార్య భర్తల బంధం గురించి వివరించిది. ఈ క్రమంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న ప్రేమాయణాన్ని గురించి తెలిపింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి!

New Update
Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్‌ లో ఉండడంతో!

టాలీవుడ్‌ నటి స్నేహ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ప్రియమైన నీకు సినిమాతో ఎంట్రీ ఇచ్చి..తన అందం,  అభినయంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ కు బాగా దగ్గర అయ్యింది. ఆ తరువాత ఆమె తమిళ నటుడు ప్రసన్న కుమార్ తో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

పొజెసివ్‌నెస్ ఉండాలి కానీ అతిగా

ఇక అప్పటినుంచి స్నేహ సహా నటిగా నటిస్తుంది. అలాగే పలు యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అయితే చివరగా స్నేహ మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఏ కొత్త మూవీ అనౌన్స్‌ చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ తన భర్తకు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘ జనాల్లో పొజెసివ్‌నెస్ ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. ముఖ్యంగా జంటల మధ్య అసలు ఉండకూడదు. ఎందుకంటే నమ్మకాన్ని కాపాడుకోవడం కష్టంగా మారి ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. ఉదాహరణకు.. పార్ట్‌నర్ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు.. ఎందుకు.. వెళ్లి ఏం చేస్తావ్ అని అనుమానం అసలు రాకూడదు.

ప్రేమ పెరిగి బంధం మరింత

భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ఇలాంటి ప్రశ్నలు రావు. భార్యభర్తలిద్దరి మధ్య నమ్మకం ఉండాలి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. పార్ట్‌నర్ అడగకముందే వారికి చెప్పి వెళ్తే వాళ్లకి కూడా పొజెసివ్‌నెస్ రాదు. అలాగే మనం వెళ్లాలనుకున్న చోటుకి చేరుకున్నాక.. భాగస్వామికి ఫోన్ చేసి చెప్తే బెటర్.వారితో కాసేపు మాట్లాడితే.. ప్రేమ పెరిగి బంధం మరింత బలపడుతుంది. అయితే నా భర్త కూడా ఒకానొక సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఏవో కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు.

ఓ అవార్డ్ రావడంతో

ఈ విషయం తెలిసాక నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అలా విడిపోక పోతే ప్రసన్న ఈరోజు నాకు భర్త అయ్యేవాడు కాదు కదా. అందుకే ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఓ సమస్య వల్ల ఒత్తిడికి లోనయ్యాను. అలా ఒక ఏడాది పాటు గడిపాను. అప్పుడే నాకు ఓ అవార్డ్ రావడంతో.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read: పిల్లల నెస్లే ప్రొడక్ట్స్ లో కల్తీ.. షాకింగ్ నివేదిక!

#prasanna-kumar #sneha #actress #love-story
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎం...

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment