Shalini Pande : "ఆ సీన్ చీకటి గదిలో చేశారు"... భయమేసి బయటకు వెళ్ళిపోయిన షాలిని..! నటి షాలిని పాండే 'మహారాజ్' చిత్రంలో తాను చేసిన ఓ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది."చీకటి గదిలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. నాకేమో చీకటంటే భయం. దాంతో అశాంతిగా అనిపించింది. వెంటనే లేచి బయటకు పరుగు తీశాను అని చెప్పుకొచ్చింది షాలిని". By Archana 01 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shalini Pande Shared Interesting Incident : జునైద్ ఖాన్ (Junaid Khan), షాలినీ పాండే (Shalini Pande), శర్వరి, జైదీప్ అహ్లావత్ నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ్ (Maharaj). ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. విడుదలకు ముందే వివాదాలను ఎదుర్కున్న ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ( OTT) లోకి వచ్చింది. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్దార్థ్ పి మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే 'కిషోరీ' పాత్రలో నటించింది. నటుడు జైదీప్ 'జదునాథ్ మహారాజ్' పాత్రను పోషించారు. అప్పట్లో 'చరణ్ సేవ' అనే ఆచారం పేరుతో ఆడపిల్లలు మహారాజ్‌కి తమను తాము అంకితం చేసుకోవాలనే దురాచారాన్ని, భక్తి ముసుగులో అమ్మాయిలకు చేస్తున్న అన్యాన్ని ఈ సినిమాలో చూపించారు. సీన్ నుంచి బయటకు వెళ్ళిపోయాను అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న షాలిని సినిమాలో 'చరణ్ సేవ' సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో చరణ్ సేవా సన్నివేశం గురించి మాట్లాడుతూ ... "నేను నిజంగా మహారాజ్‌తో ఆ సన్నివేశం(చరణ్ సేవా ) చేసినప్పుడు.. అది నా మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నాకు తెలియదు. ఆ సీన్ చీకటి గదిలో షూట్ చేశారు. నాకు చీకటంటే భయం. దాంతో అశాంతిగా, స్వచ్ఛమైన గాలి కావాలని అనిపించింది. వెంటనే లేచి బయటకు వెళ్ళాను. నా పరిస్థితి గమనించిన డైరెక్టర్. నా చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూట్ చేశారు. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది అంటూ చెప్పుకొచ్చింది షాలిని. Also Read: Kalki Day 4 Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'కల్కి' వసూళ్ల సునామీ.. నాలుగు రోజుల్లో రూ. 302 కోట్లు..! - Rtvlive.com #ott #maharaj #shalini-pande మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి