Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం!

నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్‌ చేశారని ఆరోపించింది.

New Update
Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం!

Jatwani case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్‌ జెత్వానీ వేధింపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తనను 45 రోజులు పాటు బంధించి చిత్ర వధ చేశారని.. బట్టల్లేకుండా ఫొటోలు తీసి పోలీసులు, వైసీపీ నేతలు హింసించారని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గోడు వెళ్లబోసుకుంది. పలువురు తనకు న్యూడ్‌ కాల్స్‌ చేశారని, ఒక ఒంటరి యువతినైనా తనను చిత్రహింసలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనేదనని, వారికి ఎవరూ లేరని.. వేధింపుల వల్ల ఇప్పటికే వారు అనారోగ్యం పాలయ్యారని బోరున విలపించింది. ఏపీతోపాటు తమకు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించాలని, తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరు పెట్టుకుంది.

అసలేం జరిగిందంటే..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన కాదంబరి జెత్వానీని వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్‌ అధికారులు వేధించారనే వార్త దుమారం రేపుతోంది. ముంబైకి చెందిన కాదంబరి జెత్వానీని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు, ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. అనంతరం అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు. ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకూడదంటూ బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించేశారు. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్‌ గున్నీ వైపే చూపిస్తున్నాయి.

వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ..
కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు, 2014లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ వివాహానికి వెళ్లిన నాగేశ్వర రావుకు కాదంబరి జెత్వానీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్‌ నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడంతో పాటు, ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు, పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటాను ఆదేశించారు.

బెదిరింపుల వెనుక పెద్ద తలకాయలు..
కాదంబరి జెత్వానీ గుజరాత్‌కు చెందిన యువతి. ఆమె ముంబైలో నటిగానూ, మోడల్ కోఆర్డినేటర్‌గానూ పనిచేస్తోంది. వైసీపీ నేత జోలికి రాకుండా చేసేందుకు గాను ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ముంబై నుంచి కృష్ణా జిల్లాకు తీసుకువచ్చి ఓ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాదంబరి జెత్వానీ ఓ తెలుగు న్యూస్ చానల్‌తో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. తమకు ప్రాణహాని ఉందని, తమకు పోలీసు రక్షణ కావాలంటూ, ఈ తప్పుడు కేసుల నుంచి న్యాయపరమైన రక్షణ కూడా కావాలంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని తెలిపింది.

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
దేశవ్యాప్తంగా తనకు రక్షణ కావాలని అన్నారు. ఆంధ్రాలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు పెట్టారా? అని యాంకర్ ప్రశ్నించగా... ఆంధ్రాలో తనకు ట్రైలర్ మాత్రమే చూపించారని, సినిమా ఇంకా మిగిలే ఉందని ఆమె ఏడుస్తూ బదులిచ్చారు. తాను ఒక ఒంటరి యువతినని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలనని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. 2014లో తాను తెలుగు సినిమా రంగంలో పనిచేశానని, ఆ సమయంలోనే విద్యాసాగర్‌తో పరిచయం ఏర్పడిందని, అతడు ఖరీదైన గిఫ్టులతో తనను ప్రలోభాలకు గురిచేశాడని కాదంబరి జెత్వానీ ఆరోపించింది. ఓ కేసులో అతడు మూడేళ్లు తప్పించుకుని తిరిగాడని, ఒకరోజు తన అపార్ట్‌మెంట్‌లో ప్రత్యక్షమై ఫోన్ అడిగాడని, కొన్ని కాల్స్ చేసుకుంటానని చెప్పడంతో భయపడ్డానని వెల్లడించింది. అతడిని పోలీసులు 2017లో అరెస్ట్ చేశారని తెలిపింది. కాగా కొందరు వ్యక్తులు (పోలీసు అధికారులు) తమ కుటుంబానికి చెందిన 10 ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లారని.. అందులో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఆ వస్తువులను తిరిగి ఇవ్వలేదని చెప్పింది.

బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ లో పెట్టించి..
అంతేకాదు తమ బ్యాంక్ అకౌంట్లను నిలిపివేయించారని, దాంతో తాము రోజు గడిచేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోరున విలపించింది. కుక్కల విద్యాసాగర్‌ తనను లైంగికంగా వేధించాడని.. తన తల్లిదండ్రులు ఉండగానే న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేశాడని తెలిపింది. తాను లండన్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ కూడా రద్దు చేయించారని తెలిపారు. సంబంధం లేని కేసులో, అధికార పార్టీలో ఉన్న నాయకుడి కోసం ఆమెను హింసించి, 45 రోజులు బంధించి, కుటుంబ సభ్యులను హింసించి, ఇంటిని ఇతర ఆస్తులను సీజ్ చేస్తే, రోజు గడిచేందుకు అప్పులు చేశామని ఆమె బాధపడింది. తమ పట్ల వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితపై తనకు నమ్మకముందని.. వారు తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

స్రవంతి రాయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం..
అయితే ఆ ఘటనపై RTVతో మాట్లాడిన విజయవాడ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు.. తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం వైసీపీ పాలనలో నటి జత్వానిపై అక్రమ కేసు బనాయించి, వేధించిన నాయకులు, సీనియర్‌ ఐపీఎస్‌లపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీపీ స్రవంతి రాయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కార్.. అవసరమైతే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment