Srikanth: హీరోయిన్లతో ఎఫైర్స్ పై శ్రీకాంత్ ను నిలదీసిన డైరెక్టర్.. ఊహ డివోర్స్ అడిగింది నిజమేనా!

హీరోయిన్లతో అక్రమ సంబంధం ఉందనే వార్తలను నటుడు శ్రీకాంత్ ఖండించారు. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. జనాలు ఏదేదో రాస్తూ పుకార్లు క్రియేట్ చేసుకుంటే నాకు సంబంధం లేదు. చాలామందితో కంఫర్ట్‌గా ఉండటమే తెలుసు. ఎఫైర్స్ పై ధ్యాసలేదు. విడాకుల వార్తలు చూసి ఊహ షాక్ అయిందని తెలిపారు.

New Update
Srikanth: హీరోయిన్లతో ఎఫైర్స్ పై శ్రీకాంత్ ను నిలదీసిన డైరెక్టర్.. ఊహ డివోర్స్ అడిగింది నిజమేనా!

Actor Srikanth : టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ పలువురు హీరోయిన్లతో అక్రమ (Affair) సంబంధం ఉందనే వార్తలపై స్పందించారు. తొంబైలో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శ్రీకాంత్ అప్పట్లో పట్టిందల్లా బంగారమే అయింది. బ్యాక్ టూ బ్యాక్ ఫ్యామిలీ స్టోరీలతో ప్రేక్షకులను అలరించగా.. ఆయనతో నటించేందుకు స్టార్ హీరోయిన్లు క్యూ కట్టారు. ముఖ్యంగా స్నేహా- శ్రీకాంత్ జోడీ సూపర్ హిట్ టాక్ అందుకోగా వీరిద్దరి కలయికలో చాలా సినిమాలొచ్చాయి. అయితే కొంతకాలానికి శ్రీకాంత్- స్నేహకు మంచి రిలేషన్ ఏర్పడగా.. ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ నటుల మధ్య అక్రమ సంబంధం కూడా ఉందని, శ్రీకాంత్ భార్య, నటి ఊహ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో సైడ్ క్యారెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్న శ్రీకాంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎఫైర్స్ ఇష్యూ గురించి ఓపెన్ అయ్యారు.

ఈ మేరకు ప్రముఖ దర్శకుడు.. శ్రీకాంత్ తో ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల గురించి చర్చించారు. సినిమా హీరోలంటే హీరోయిన్లతో ఎఫైర్లు ఉంటాయని అంటారు కదా. పెళ్లికి ముందు నీకు ఎంతమందితో ఎఫైర్ ఉంది? అని దర్శకుడు అడిగారు. దీంతో వెంటనే షాక్ అయిన శ్రీకాంత్.. నాకు ఎంతమందితో ఎఫైర్ ఉందో మీకు తెలియదా. హీరోని చేసింది మీరే కదా. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు. మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి' అంటూ అతన్నే అడిగాడు. దీంతో 'నాకు సంబంధం లేదు. నువ్ మంచివాడినే అనుకున్నా. కానీ బయట అనుకుంటున్నారు కదా! దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించారు. 'వాళ్లేదో అనుకుంటే నాకు సంబంధం లేదు. మొన్న రాశీ నేను ఏదో ఫంక్షన్‌కు వెళ్తే ఏదేదో అనుకున్నారు. నేను అవన్నీ పట్టించుకోనని చెప్పారు.

ఇది కూడా చదవండి : Nagababu Vs RGV: ఆర్జీవీని పెగ్గేసి పడుకోమన్న నాగబాబు.. అన్నదమ్ములు అడుక్కు తింటున్నారంటూ వర్మ కౌంటర్

అలాగే స్నేహ (Sneha)తో రిలేషన్ గురించి వివరణ ఇవ్వాలని కోరిన దర్శకుడు.. నిన్ను స్నేహా పిచ్చకొట్టుడు కొడుతుంది ఏందుకో చెప్పాలని కోరాడు. 'మేం ఇద్దరం ఓ ఫంక్షన్‌లో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అక్కడికి వచ్చిన ఈ హీరోయిన్‌ రాశీని చూసి రాశి అమ్మా అని అంది. నాకు నవ్వు వచ్చింది. అప్పుడే అమ్మని చేసేశారా అని. నేను కూడా రాశి అమ్మా అని అన్నాను. దానికి ఆమె సరదాగా కొట్టింది. అంతకుమించి ఏం లేదు. చాలా ఏళ్లు పగలూ రాత్రుళ్లు షూటింగ్ చేశాను. కానీ, ఇలాంటి స్ట్రగుల్ నా జీవితంలోనే పడలేదు. నాకు ఆ ధ్యాస ఎఫైర్స్‌పై లేదని శ్రీకాంత్ వివరించారు. అలాగే ఈ ఎఫైర్ పుకార్ల కారణంగా ఊహ తనను విడాకులు కోరిందని, టీవీలలో బ్రేకింగ్‌లు చూసి ఇద్దరూ షాక్ అయినట్లు తెలిపారు శ్రీకాంత్. చివరగా తాను నటించిన వాళ్లలో సౌందర్య, రాశీతోపాటు చాలామందితో కంఫర్ట్‌గా ఉండేదని, ఇప్పటికీ చాలామంది కోస్టార్స్ తన ఇంటికి వస్తుంటారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment