Delhi Incident: కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న అధికారులు

ఢిల్లీలోని రాజేందర్‌ నగర్‌లో రావుస్‌ స్టడీ సర్కిల్‌ బెస్‌మెంట్‌లోకి వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని అక్రమ నిర్మాణాలపై అధికారులకు చర్యలు దిగారు. జేసీబీతో వాటిని కూల్చివేస్తున్నారు.

New Update
Delhi Incident: కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న అధికారులు

ఢిల్లీలోని రావుస్‌ స్టడీ సర్కిల్‌ బెస్‌మెంట్‌లోకి వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని అక్రమ నిర్మాణాలపై అధికారులకు చర్యలు దిగారు. జేసీబీతో వాటిని కూల్చివేస్తు్న్నారు. ఇప్పటికే ఢిల్లీలో అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. రూల్స్‌కు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది: రాహుల్

ఇదిలాఉండగా.. రావుస్‌ స్టడీ సర్కిల్‌ బెస్‌మెంట్‌లోకి వరదలు రావడంతో ముగ్గురు విద్యార్థులు తానియా సోనీ, శ్రేయా యాదవ్, వెవిస్‌ డాల్వన్ ప్రాణాలు కోల్పోయారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని అక్కడ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు సోమవారం బీజేపీ శ్రేణులు, నేతలు ఆప్‌ కార్యాలయానికి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణులను వాటర్‌ కెనన్స్‌తో చెదరగొట్టారు. ఇదిలాఉండగా.. ప్రమాదానికి ముందు రావుస్ స్టడీ సర్కిల్‌లో తీసిన విజువల్స్‌ కూడా వైరలవుతున్నాయి.

Also Read: రిజర్వేషన్ సమస్య పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

Advertisment
Advertisment
తాజా కథనాలు