స్కిల్ స్కాంలో అచ్చెన్నాయుడు పేరు..రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!! టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. By Bhoomi 10 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ప్రధాన నిందితుడి ఏ1గా చేర్చింది సీఐడీ. ఈ క్రమంలో ఆయన్ను విచారించేందుకు 15రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని న్యాయమూర్తినిని సీఐడీ కోరింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద విజయవాడ కోర్టులో ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబు పై నేరాభియోగం మోపినట్లు తెలుస్తోంది. ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలు ఉన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఇది కూడా చదవండి: G20లో స్పెషల్ అట్రాక్షన్‌గా వాల్ పోస్టర్..ఇందులో ప్రత్యేకత ఏంటంటే..!! ప్రజా సేవకుడిగా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని నివేదికలో పేర్కొంది. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు పై అభియోగాలు ఉన్నాయి. 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. డిజైన్ టెక్ సంస్థ... కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్న సీఐడీ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు..!! టెక్నాలజీ పార్టనర్లుగా నామినేషన్ పద్దతిలో ఈ సంస్థలను నియమించారని, వారికి 371కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని పేర్కొన్న రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, తమ స్వార్ధం కోసం ఈ విధంగా చేశారని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది. తాజాగా స్కిల్ స్కాంలో అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. #ap-news #tdp #chandrababu-arrest #skill-development-case #cid #skill-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి