Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి!

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

New Update
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి!

Andhra Pradesh : ఏలూరు జిల్లా (Eluru District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టింది . దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి అక్కడిక్కడే మరణించారు.

మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ (Vijayawada) వైపు నుంచి రాజమండ్రి (Rajahmundry) వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందడంతో మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Also read: విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment