/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-10T092031.505-jpg.webp)
Accident At kavali Toll Plaza:నెల్లూరు జిల్లా కావలి, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సు, లారీ గుద్దుకున్నాయి. అర్ధరాత్రి రెండు గంటలు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఇందులో మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు కూడా రావడంతో ప్రమాదం పెద్దగా జరిగింది. బస్సు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది.
కావేరీ ట్రావెల్స్ బస్సు...
ప్రమాదం పాలైన బస్సు కావేరీ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. ఇది చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేటపట్టారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా...ఒక మహిళ, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత అవకాశం ఉందని తెలుస్తోంది.
గాయపడిన వారి వివరాలు..
చంద్ర శేఖర్(37)..
సురేష్..(32)
గోపి నాథ్ (23)
మనోజ్ (23)
రాజ్ కుమార్ (38)
ఎస్.రమణ (38)
పవన్ (23)
ధనవేశ్వర్ (28)
రణధీర్ (31)
త్రికరణ్ (46)
శ్వేతా (19)
అజిత (30)
కన్నన్ (50)
రూప( 30)
మైథిలి (35)
అక్షయ్ (34)
గణేష్(51)
నితీష్ (20)..
లోకేష్ (35)
లక్ష్మీ (34)
కమలమ్మ (63)
నిర్మల(49)
కేశవ్(39).
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు.
దిగజారిన వ్యవస్థలు..
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.
(ys-jagan | telugu-news | telugu breaking news)
BIG BREAKING: కేంద్రమంత్రి అరెస్టు.. !
HYDRAA: హైడ్రాకు జై కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రంగనాథ్ ను కలిసి ప్రశంసలు!
Madhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఎనిమిది మంది మృతి!
Mamata Benarjee: వక్ఫ్ బోర్టుకు వ్యతిరేకంగా అల్లర్లకు వారే కారణం: మమతా బెనర్జీ
టీ షర్ట్ నుండి ఖద్దర్ షర్ట్ లుక్కు మార్చేసిన జగ్గారెడ్డి | JaggaReddy Wearing Khaddar shirt | RTV