ACB : మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్

అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను వీరు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

New Update
ACB : మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్

Jogi Ramesh : అగ్రిగోల్డ్ భూమలు (Agri Gold Lands) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు అధికారులు. తనిఖీల్లో 15 మంది ఏసీబీ (ACB) అధికారులు పాల్గొన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్‌ చేశారు అని జోగి రాజీవ్‌ ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లే మేం కొన్నాం అని ఆయన అన్నారు.

Also Read : 28 దీవులను భారత్‌ కి అప్పగించిన మాల్దీవులు!

ఏ1 గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఏ2 గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, ఏ3 గా అడుసుమిల్లి మోహన్ రామ్ దాస్, ఏ4 గా అడుసుమిల్లి వెంకట సీత మహాలక్ష్మి, ఏ5 గా గ్రామ సచివాలయం సర్వేయర్ దేదీప్య, ఏ6 గా మండల సర్వేయర్ రమేష్, ఏ7 గా డిప్యూటీ తాసీల్ధార్ విజయ్ కుమార్, ఏ8 గా మండల తసీల్ధార్ పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు అధికారులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు