Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు!

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అయ్యింది.

New Update
Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ACB Raids : మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయమే ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్‌ భూములను (Agri Gold Lands) కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read : కోల్‌కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు