Karnataka: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడి మీద లైంగిక వేధింపుల కేసు

కర్ణాటకలో హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణపై కూడ లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ నెల 16న తనను ఫామ్‌ హౌస్‌కు పిలిచి లైంగికంగా వేధంచాడని ఓ యవకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Karnataka: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడి మీద లైంగిక వేధింపుల కేసు

Suraj Revanna: కర్ణాటకలో నేతల మీద లైగింక వేధింపుల కేసులు వరుసగా నమోదవుతూనే ఉన్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి మీద నమోదిన కేసులు, అయిన గొడవ చూసినా బుద్ధి రాలేదు. మళ్ళీ అలాంటి పనికే పాల్పడ్డాడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ. ప్రజ్వల్ రేవణ్ణకు ఇతను పోదరుడు అవుతాడు. అన్న చేసిన పనికి మొత్తం జేడీఎస్ ఓ పెద్ద కుదుపుకు గురైంది. రాజకీయంగా ప్రకంపనలు వచ్చాయి. పార్టీ, దేవెగౌడ కుటుంబం మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయినా కూడా మళ్ళీ అదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సూరజ్.

తనను ఫామ్‌ హౌస్‌కు పిలిచి లైంగికంగా వేధించాడు అంటూ ఈ నెల 16న ఓ యువకుడు పోలీసలకు ఫిర్యాదు చేశాడు. సహకరించకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. దీంతో పోలీసులు సూరజ్‌ మీద కేసు నమోదు చేశారు.

సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇతని మీద లైగింకారోపణలు చాలానే వచ్చాయి. పోలీసు కేసు కూడా నమోదయ్యింది. అది కాక వీడియోలు కూడా చలానే బయటపడ్డాయి.ఇదంతా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని...అందుకే అతనని పార్టీ నుంచి స్పెండ్ చేయాలని నిన్న పలువురు నేతలు అధినేత దేవెగౌడ్కు లేఖలు రాశారు. దీని మీద అందరితో చర్చించిన దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు  ప్రకటించారు.

ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్‌ స్కాండల్‌...! ఈ రెండు పదాలు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఒకటి కాదు, రెండు కాదు, వంద కాదు, ఏకంగా 3వేలకు పైగా అసభ్యకర వీడియోలను అధికారులు గుర్తించారు. అమ్మాయిలతో అలాంటివి చేయడం.. దాన్ని వీడియో రికార్డ్ చేయడం.. తర్వాత బ్లాక్‌ మెయిల్ చేయడం.. ఇది ప్రజ్వల్ రేవణ్ణ దినచర్యగా తెలుస్తోంది. ఈ స్కాండల్‌కు సెంటర్‌గా ఉన్న కర్ణాటకనే కాకుండా మొత్తం దేశ రాజకీయల్లోనే ఈ టాపిక్‌పై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది.

Also Read:Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు