Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన 'SRH' ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!

SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో 41 సిక్స్‌లు కొట్టి.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్ గా అవతరించి విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

New Update
Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన 'SRH' ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!

Abhishek Sharma Breaks Virat Kohli's Record : ఐపీఎల్ 2024 లీగ్ లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తన టాప్ క్లాస్ బ్యాటింగ్ తో షేక్ ఆడిస్తున్నాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా తోటి ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి ప్రతీ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు.

అంతేకాకుండా ఈ సీజన్‌లో 41 సిక్స్‌లు కొట్టి.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్ గా అవతరించి విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ 2016 లో 38 సిక్సర్లు కొట్టి ఈ రికార్డ్ క్రియేట్ చేయగా.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) 41 సిక్సులు కొట్టి దాన్ని బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో తన ఆటతీరుపై శర్మ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

నాకు మంచి రోజులు నడుస్తున్నాయి

ఇప్పుడీ ఎడిషన్‌లో బ్యాటర్లదే హవా. ప్రస్తుతం నాకు మంచి రోజులు నడుస్తున్నాయి. ఈ బ్యాటింగ్ ప్రదర్శనను టీమ్ విజయాల కోసం ఉపయోగిస్తున్నా. పంజాబ్‌తో భారీ లక్ష్యం ఉండటంతో ఎలాగైనా నా కంట్రిబ్యూషన్‌ ఉండాలని డిసైడ్ అయ్యా.. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశా. ఎలాంటి షాట్లు కొట్టాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా. లారా మా కోచ్‌గా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తీవ్రంగా శ్రమించా. ఇప్పటికీ ఏదైనా సందేహం ఉంటే లారా అందుబాటులోనే ఉంటాడు.

చెత్త బంతుల కోసం వెయిట్ చేసి మరీ ఆడుతున్నా. బౌలర్లను కాస్త ఒత్తిడికి గురి చేస్తే ఆ తర్వాత మనం అనుకున్న విధంగా బ్యాటింగ్‌ చేయొచ్చు. గతి తప్పిన బంతులను ఏమాత్రం ఉపేక్షించను. నాకు ఎప్పుడూ మద్దతుగా ఉండే అభిమానులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉప్పల్ మైదానం క్యురేటర్, గ్రౌండ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. మా శైలికి అనుకూలంగా ఉండేలా పిచ్‌ను తయారు చేసి ఇచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..

Advertisment
Advertisment
తాజా కథనాలు