తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు..అసలు ఏం జరిగిందంటే..?

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంధ్య అనే గర్భిని బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. అయితే, కేవలం డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య మృతి చెందిదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళణ చేస్తున్నారు.

New Update
తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు..అసలు ఏం జరిగిందంటే..?

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad) తొర్రూరు మండలం అమర్ సింగ్ తండా గ్రామానికి చెందిన గుగులోతు సంధ్య(23) నిండు గర్భిణి. పురిటి నొప్పులతో బాధపడుతున్న సంధ్య తొర్రూరు పట్టణ కేంద్రంలోని పద్మావతి నర్సింగ్ హోమ్ లో డెలివరీ కోసం వచ్చింది. ఆసుపత్రిలోని డాక్టర్‌ యాదగిరి రెడ్డి సంధ్యకు ఆపరేషన్‌ చేసారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డాక్టర్ ఆపరేషన్‌ చేస్తుండగా సంధ్య మృతి చెందింది. కానీ, ఆపరేషన్ చేసే సమయంలో మృతి చెందిన సంధ్యను ఆమె పరిస్థితి విషమించింది అని బంధువులకు తెలియజేసి..వరంగల్ అజార హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశాడు డాక్టర్ యాదగిరి రెడ్డి.

సంధ్య మృతి చెందిందని గుర్తించిన బాధిత బంధువులు తొర్రూరులోని పద్మావతి నర్సింగ్ హోమ్ హాస్పటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. సంధ్యా మృతికి కారణం డాక్టర్ యాదగిరి రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య మృతికి నష్ట పరిహారం చెల్లించి, కారణమైన డాక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే హాస్పటల్ లో ఇలాంటి ఘటన లు తరుచూ జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.

అసలు విషయం తెలియని ఆ పసికందు తన తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పసిపాప ఏడుపు అందరిని కదిలిస్తోంది. పుట్టిన పసిబిడ్డను చూసి అందరూ కన్నిటి పర్యంతం చెందుతున్నారు. తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలియక ఆ చిన్నారి తన తల్లి ప్రేమ కోసం బోరున విలపిస్తోంది.

Also Read: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు