Bhadradri : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. ఇందులో ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారు! భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. ఇందుకు నిందితుడి భార్య సైతం సహకరించింది. భర్తపై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు కత్తులతో దాడి చేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Anil Kumar 11 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana News : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి (Extra Marital Affair) అడ్డొస్తున్నాడని సొంత భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ దారుణానికి నిందితుడి భార్య సైతం సహకరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం గౌతమ్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రమేష్‌కు కొన్నాళ్లుగా రెహానాతో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం తెలిసిన రెహానా భర్త సాహు ఈశ్వర్‌కుమార్.. రమేష్‌ను అక్కడినుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రమేష్ సింగరేణి క్వార్టర్స్‌లో అక్రమంగా ఉంటున్నాడని ఈశ్వర్‌కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో రమేష్‌ను సింగరేణి (Singareni) అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. Also Read : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి.. ఆ తర్వాత రమేష్ తో వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భార్య తన భర్త హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్‌కుమార్‌పై రమేష్, అతని భార్య ఇందిర, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో భార్య రెహానా ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలాకాసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్‌కుమార్ మృతి చెందాడు. తమ ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు రెహానా అక్కడి స్థానికులను నమ్మించింది. అయితే రెహానాపై అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. #bhadradri-kothagudem #boy-friend #extra-marital-affair #wife-husband-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి